80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే, జాతీయ జెండాను ఎగురవేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే 15 ఆగస్టు న, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సంధర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జాతీయ జెండాను ఎగురవేసి, ఆర్‌.పి.ఎఫ్ బృందంచే జాతీయ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్; దక్షిణ మధ్య రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ శ్రీమతి అరోమా సింగ్ ఠాకూర్; సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు; రైల్వే పాఠశాల మరియు కళాశాల నుండి విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రైల్వే డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల మరియు రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహించిన కమాండో షో మరియు డాగ్ షో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా ప్రదర్శించారు మరియు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి.

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రాత్మక సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రసంగంలో, జనరల్ మేనేజర్ దేశానికి స్వాతంత్ర్యాన్నిసాధించిపెట్టిన స్వాతంత్ర్య సమరయోధుల ధైర్యసాహసాలకు మరియు త్యాగాలకు ఆయన నివాళులర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది వారి కృషిని స్మరించుకోవడానికి మరియు దేశ పురోగతి, అభివృద్ధి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించుకోవడానికి ఒక సందర్భమని ఆయన పేర్కొన్నారు.

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ 1 జూన్ న దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు ప్రారంభమైన నేపధ్యంలో, దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుతం సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్‌లతో 3,605 రూట్ కిలోమీటర్ల పరిధి మేర విస్తరించి ఉందని మరియు ఇంతటి కీలకమైన నిర్మాణాత్మక మార్పు జరిగినప్పటికీ, దక్షిణ మధ్య రైల్వే తన కార్యకలాపాల సామర్ధ్యాన్ని కొనసాగిస్తూ ప్రశంసనీయమైన పనితీరును కనబరుస్తూనే ఉందని తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో జోన్ యొక్క పనితీరు మరియు అత్యుత్తమ విజయాలను ప్రస్తావిస్తూ, జనరల్ మేనేజర్ ఈ జోన్ ₹ 4,060.57 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసిందని, ఇందులో సరుకు రవాణా ఆదాయం ₹ 2,640.80 కోట్లు మరియు ప్రయాణీకుల ఆదాయం రూ. 1,236.88 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఈ కాలంలో 30.593 మిలియన్ టన్నుల వివిధ వస్తువులను రవాణా చేయడంతో, సరుకు రవాణా ప్రోత్సాహకరమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. మిషన్ రాఫ్తార్ కింద, ఈ జోన్ ఓపెన్ వ్యాగన్ల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్ల వరకు పెంచే చర్యలను కూడా చేపట్టిందని ఆయన తెలిపారు.

Also Read-

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ భద్రత గురించి ప్రస్తావిస్తూ, అన్ని కార్యకలాపాల్లో ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలను కొనసాగించేందుకు జోన్ నిరంతరం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ దిశలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 135.22 కిలోమీటర్ల మేర ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పాటు, 20 రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని పూర్తి చేసి, రైలు కార్యకలాపాల భద్రతను మరింత బలోపేతం చేయడమైనది తెలిపారు. అదేవిధంగా ‘కవచ్’ మరియు ‘డిజిటల్ ఇంటర్‌లాకింగ్’ వ్యవస్థల అభివృద్ధిలో మార్గదర్శకమైన కృషి చేసినందుకుగాను దక్షిణ మధ్య రైల్వే “ఉత్తమ జోనల్ రైల్వే”గా ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి S&T అవార్డుతో గౌరవించబడిందని వెల్లడించారు.

మౌలిక సదుపాయాల పురోగతి మన అభివృద్ధి ప్రస్తానానికి మూల స్తంభంగా కొనసాగుతోందని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆసిఫాబాద్ – సిర్‌పూర్ కాగజ్‌నగర్ సెక్షన్ మధ్య ట్రిప్లింగ్ పూర్తయిందని, దీంతో ముఖ్యమైన కాజీపేట – బల్హర్షా ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తయిందని ఆయన అన్నారు. అదనంగా, మన్యంకొండ – మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్, లాలాగూడ మరియు సీతాఫల్‌మండి ఎ క్యాబిన్ మధ్య కార్డ్ లైన్ నిర్మాణం, ఆమ్లాఖుర్ద్ – తుకైతాడ్ సెక్షన్ల మధ్య గేజ్ మార్పిడి కూడా పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

మెరుగైన ప్రయాణీకుల సేవల కోసం నిరంతరంగా వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు జతల కొత్త రైలు సర్వీసులను ప్రారంభించడంతో పాటు, 31 జతల ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా క్రమబద్ధీకరించిందని జనరల్ మేనేజర్ తెలియజేశారు. దీనికి అదనంగా, ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడానికి 75 ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు, ఇప్పటికే ఉన్న రైలు సర్వీసులకు 652 అదనపు కోచ్‌లను జతచేశారని తెలిపారు.

పర్యావరణ సుస్థిరతపై మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే తన సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 13.34 మెగావాట్లకు విస్తరించిందని జనరల్ మేనేజర్ తెలిపారు. రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యం కంటే 30 శాతం అధికంగా, గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ, ‘మిషన్ జీరో స్క్రాప్’ చొరవ కింద ఈ జోన్ అద్భుతమైన స్థిరత్వాన్ని కొనసాగించిందని కూడా ఆయన పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే కుటుంబం యొక్క సహకారం మరియు సమష్టి కృషితో, ఈ జోన్ పురోగమిస్తూ భారతీయ రైల్వే మరియు దేశ అభివృద్ధికి దోహదపడుతుందని జనరల్ మేనేజర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X