प्रतिबंधित माओवादी पार्टी को एक और बड़ा झटका, वरिष्ठ नेता प्रशांत बोस का जेल में निधन

हैदराबाद: प्रतिबंधित माओवादी के वरिष्ठ नेता और पोलित ब्यूरो मेंबर प्रशांत बोस (75) उर्फ ​​किशन दा का निधन हो गया। बोस रांची की सरायकेला जेल में रिमांड कैदी थे और शुक्रवार सुबह उन्हें सांस लेने में गंभीर दिक्कत आई। इस वजह से जेल अधिकारियों ने उसे भारी सिक्योरिटी के बीच सुबह 6 बजे रांची के RIMS हॉस्पिटल में भर्ती किया। हालांकि, वहां मेडिकल टीम ने इमरजेंसी इलाज किया, लेकिन कोई फायदा नहीं हुआ। अधिकारियों ने सुबह करीब 10 बजे उनकी मौत की पुष्टि की।

माओवादी के जनरल सेक्रेटरी नंबाला केशव राव के बाद किशन दा को पार्टी में सबसे ताकतवर ‘नंबर-2’ नेता के तौर पर जाना जाता था। वह पार्टी की सेंट्रल कमेटी और पोलित ब्यूरो के मेंबर के पद पर थे। वह पार्टी के लिए ‘थिंक टैंक’ के तौर पर काम करते थे। ईस्टर्न रीजनल ब्यूरो के सेक्रेटरी के तौर पर उन्होंने बिहार, झारखंड, पश्चिम बंगाल और ओडिशा राज्यों में माओवादी पार्टी की एक्टिविटी को बढ़ाने में अहम भूमिका निभाई। उसके साथी उसे ‘मनीष’ और ‘बुद्ध’ भी कहते हैं।

झारखंड सरकार ने प्रशांत बोस के सिर पर एक करोड़ रुपये का इनाम घोषित किया है। दशकों तक पुलिस से बचने के बाद, उसे नवंबर 2021 में झारखंड पुलिस ने एक बड़े ऑपरेशन में गिरफ्तार किया था। उसकी पत्नी, माओवादी सेंट्रल कमेटी की सदस्य शीला मरांडी भी उस समय पकड़ी गई थी। तब से, वह रांची की बिरसा मुंडा सेंट्रल जेल में है।

गौरतलब है कि सितंबर 2004 में, माओइस्ट कम्युनिस्ट सेंटर ऑफ़ इंडिया और कम्युनिस्ट पार्टी ऑफ़ इंडिया (मार्क्सिस्ट-लेनिनिस्ट) पीपुल्स वॉर का विलय होकर सीपीआई (माओवादी) बन गया। इस समझौते पर माओइस्ट कम्युनिस्ट सेंटर ऑफ़ इंडिया की सेंट्रल कमेटी के जनरल सेक्रेटरी किशन जी और CPI ML (पीपुल्स वॉर) की सेंट्रल कमेटी के जनरल सेक्रेटरी गणपति के बीच साइन हुए थे। उस समय, सीनियर पुलिस और इंटेलिजेंस अधिकारियों ने इस विलय को एक शानदार ‘मास्टर स्ट्रोक’ बताया।

क्योंकि ग्रुप न केवल हथियारों और मैनपावर के मामले में, बल्कि अपने कमांड एरिया को बढ़ाने के मामले में भी बढ़ा है। यह रातों-रात साउथ-ईस्ट एशिया के इलाके की सबसे बड़ी हथियारबंद पार्टी बन गई। इस विलय से किशन दा ने सेंट्रल इंडिया में लेफ्ट को और मज़बूत किया, जिसमें मध्य प्रदेश, छत्तीसगढ़, बिहार और झारखंड राज्य शामिल हैं।

विश्लेषकों का मानना हैं कि किशन दा की मौत माओवादी मूवमेंट के लिए एक ऐसी क्षति है जिसकी भरपाई नहीं हो सकती। पार्टी में सबसे अनुभवी लीडर होने के अलावा, वह स्ट्रैटेजी बनाने में भी अहम रोल निभाते थे। पॉलिटिकल एनालिस्ट का मानना ​​है कि प्रशांत बोस की मौत माओवादी पार्टी के लिए एक ऐसा झटका है जिसकी भरपाई नहीं हो सकती। पिछले कुछ सालों से टॉप नेताओं की गिरफ्तारी और मौत से परेशान है।

Also Read-

మావోయిస్టు పార్టీ అగ్రనేత ప్రశాంత్ బోస్ కన్నుమూత

హైదరాబాద్ : నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో అత్యంత కీలక నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా కన్నుమూశారు. రాంచీలోని సెరైకెలా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దీనితో జైలు అధికారులు ఉదయం 6 గంటల సమయంలో భారీ భద్రత నడుమ ఆయనను రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందం అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తర్వాత పార్టీలో అత్యంత శక్తివంతమైన ‘నంబర్-2’ నేతగా కిషన్‌ దాకు గుర్తింపు ఉంది. పార్టీ సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీకి ‘థింక్ ట్యాంక్’గా వ్యవహరించారు. ఈస్టర్న్ రీజినల్ బ్యూరో సెక్రటరీగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సహచరులు ఆయనను ‘మనీష్’, ‘బుద్ధ’ అని కూడా పిలుస్తుంటారు.

ప్రశాంత్ బోస్ తలపై జార్ఖండ్ ప్రభుత్వం రూ. 1 కోటి రివార్డును ప్రకటించింది. దశాబ్దాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన ఆయనను, 2021 నవంబర్‌లో జార్ఖండ్ పోలీసులు ఒక భారీ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు భార్య, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు శీలా మరాండీ కూడా అప్పట్లో పట్టుబడ్డారు. నాటి నుండి ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

కాగా, సెప్టెంబర్ 2004లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ విలీనమై సీపీఐ (మావోయిస్ట్) పార్టీగా ఏర్పడ్డాయి. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిషన్ జీ, సీపీఐ (ఎంఎల్ పీపుల్స్‌ వార్) సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతి మధ్య కిషన్ దా సమక్షంలోనే ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఆ విలీనాన్ని సీనియర్ పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు అద్భుతమైన ‘మాస్టర్ స్ట్రోక్’ అభివర్ణించారు.

ఎందుకంటే, ఆ గ్రూపు ఆయుధాలు, మానవ వనరుల పరంగానే కాకుండా, తన ఆజ్ఞాపాలన ప్రాంతం విస్తరణ పరంగా కూడా విస్తరించింది. అది ఆగ్నేయాసియా ప్రాంతంలో రాత్రికి రాత్రే అతిపెద్ద సాయుధ పార్టీగా సీపీఐ మావోయిస్టు పార్టీ అవతరించింది. ఈ విలీనంతో కిషన్ దా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలను కలుపుకొని ఉన్న మధ్య భారతదేశంలో వామపక్షజాలాన్ని మరింత బలపరిచారు.

కిషన్ దా మృతి మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటు అని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన నేత కావడంతో పాటు, వ్యూహరచనలో ఆయనది అందెవేసిన చేయి. గత కొన్నేళ్లుగా అగ్రనేతల అరెస్టులు, మరణాలతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి ప్రశాంత్ బోస్ మరణం కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar