వేసవి కాలం దృష్ట్యా భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, ప్రధాన విభాగాధిపతులతో పాటు పాల్గొన్నారు. విజయవాడ, గుంతకల్లు , గుంటూరు, సికింద్రాబాద్ , హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్‌లలోని మొత్తం ఆరు డివిజన్‌ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై జోన్వ్యాప్తంగా తీసుకుంటున్న జాగ్రత్తలను సమీక్షించారు. జనరల్ మేనేజర్ అగ్నిమాపక భద్రతా చర్యలపై దృష్టి సారించాలని, అలాగే సిబ్బందికి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను సిబ్బంది కచ్చితంగా పాటించేలా అధికారులు పునరుద్ఘాటించాల్సిందిగా ఆయన సూచించారు. అగ్ని మరియు పొగను గుర్తించే వ్యవస్థ (ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ సిస్టమ్) మరియు దాని నిర్వహణ విషయంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రైలు పట్టాల వెంబడి అగ్ని ప్రమాదాలనైనా నివారించడానికి గస్తీని ముమ్మరం చేయాలని ఆయన తెలిపారు.

Also Read-

జనరల్ మేనేజర్ రోలింగ్ స్టాక్ భద్రతపై నొక్కి చెబుతూ, భారీ మొత్తంలో లోడింగ్‌చేసే సంధర్భంలో కఠినమైన మార్గదర్శకాలను పాటించాలని, అసమాన లోడింగ్‌ను నివారించాలని అధికారులను ఆదేశించారు. అన్ని పాయింట్లు మరియు క్రాసింగ్‌లపై దృష్టి సారించాలని కూడా ఆయన సూచించారు. జనరల్ మేనేజర్ ట్రాక్ భద్రతపై చర్చిస్తూ, కేబుల్ డామేజ్ లు, అనధికార ప్రవేశ సంఘటనలు, బారికేడింగ్‌కు సంబంధించిన పనులు మరియు జోన్‌లోని కేబులింగ్ పనులను సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న యార్డ్ పునర్నిర్మాణం; సిగ్నల్ అప్‌గ్రేడేషన్ పనులు మరియు వంతెనలపై కాలి నడక మార్గాలు మొదలైన మౌలిక సదుపాయాల పనులను ఆయన సమీక్షించారు, నిర్దేశించిన లక్ష్యం ప్రకారం అట్టి పనులను పూర్తి చేయడానికి వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X