హైదరాబాద్ : శనివారంనాడు నాగర్ పార్లమెంట్ పరిధిలోనీ నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో 500 మార్కుల పైన సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం JSR పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని విద్యార్థుల కు బహుమానలను అందజేశారు.

ఈ సందర్బంగా ఎంపీ మల్లు రవి గారు మాట్లాడు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా గా విద్యార్థులు విద్యకు దూరమై కూలి పనులు వెట్టి చాకిరీ చేస్తు విద్యలో వెనుకబడి ఉండేవారు. ఇప్పుడు ఆ విదంగా కాకుండా పాలమూరు జిల్లా విద్యార్థులు మిగిత జిల్లాల విద్యార్థుల తో పోటీ పడుతున్నారని తెలియజేశారు.
Also Read-
ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విద్యార్థుల కు మెస్ చార్జీలు పెంచి, నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రెటేట్ రెసిడెన్సీయల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి విద్యవస్థను బలోపేతం చేస్తున్నాడని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో JD లక్ష్మి నారాయణ Ips, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
