Hyderabad:
వాళ్లంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లే
కేసీఆర్ ముఖం చూసి ఓట్లేయరు
పద్మశాలీలకు ఖాదీబోర్డు ఛైర్మన్ పదవివ్వాలి
దొంగసారా దందాతో తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే దుస్థితి
బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే రెచ్చగొట్టే యత్నం
ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ ఒక్కటే
ఏకగ్రీవ పంచాయతీలకు నయాపైసా ఇవ్వని సీఎం
సర్పంచులంతా ఆస్తులమ్ముకుని అడుక్కునే దుస్థితి
నిధులివ్వకుండా గ్రామాలను నాశనం చేస్తున్నకేసీఆర్
కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివ్రుద్ధి
బీజేపీకి అవకాశమిస్తే పేదోళ్ల రాజ్యం తీసుకొస్తాం
బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు విచ్చేసిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల దొంగ సారా దందా చేసిన కేసీఆర్ బిడ్డను చూసి దేశమంతా నవ్వుకుంటోందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చెల్లని రూపాయిగా మారారని, ఆయన ముఖం చూసి ఓట్లేసి రోజులు పోయాయన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్ కుమార్ కు ఐలాపురం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…..
కేసీఆర్ ఐలాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాడా?
ఇక్కడి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా?
కేసీఆర్ దేశ పర్యటనల పేరుతో అటే పోతాడు… ఇక తిరిగి రాడు
ఐలాపూర్ గ్రామస్తులు చాలా చైతన్యవంతులు
సంవత్సరం నుంచి మీకోసమే పాదయాత్ర చేస్తున్నా
పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకే.. ఈ పాదయాత్ర
పాదయాత్రలో తెలుసుకున్న అంశాలను రేపు మేనిఫెస్టో పెడతాం
ఇప్పుడు ఎన్నికలు లేవు.. ఓట్ల కోసమో రాలేదు
కోతల రాయుడు జగిత్యాల సభలో అన్ని కోతలే కోసిండు
వేములవాడకు 100 కోట్లు, బాసరకు 120 కోట్లు అని ప్రకటించిన కేసీఆర్… ఒక్క రూపాయి అయినా విడుదల చేశాడా?
ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అనడం హాస్యాస్పదం
కొండగట్టుకు ఇంతవరకు పోనీ కేసీఆర్, అక్కడే కుర్చీ వేసుకుని 100 కోట్ల పనులు చేయిస్తాడా?
కేసీఆర్ సభకు గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను తరలించడంతో పాటు… వారితో కుర్చీలు మోయించడం సహా అన్ని పనులు చేయించారు
ఎనిమిదేళ్లలో నష్టపోయిన ఏ ఒక్క రైతుకైనా నష్టపరిహారం ఇచ్చిండా?
రైతు రుణమాఫీ చేయలేదు
పంజాబ్లో రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి
తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసి పెట్టిండు
ప్రతి ఒక్కరి నెత్తిపై 1,20,000 అప్పు పెట్టిండు
ఎరువులపై రైతులకు సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే
ఎరువులపై సబ్సిడీ కింద రైతులకు ఒక్క ఎకరానికి, ఒక్క పంటకు 40 వేల రూపాయలు ఇస్తున్నది కేంద్రమే
రైతుబంధు పేరుతో రైతులకు అన్ని సబ్సిడీలను కట్ చేసిండు కేసీఆర్
పిల్లలు పుట్టి పెరిగినా కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు రాని పరిస్థితి
గల్ఫ్ కార్మికుల సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి
కారు గుర్తుకు ఓటు వేస్తేనే పంచాయతీలకు నిధులు ఇస్తానన్న కేసీఆర్… ఇప్పటికీ ఒక్క రూపాయి విడుదల చేయని పరిస్థితి
సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సిట్యుయేషన్ రాష్ట్రంలో నెలకొంది
గ్రామపంచాయతీలను సర్వనాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది
ఐలాపూర్ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద భారీగా నిధులను మంజూరు చేసాం
మోడీ ఇస్తున్న నిధులతో… కేసీఆర్ తన ఫోటో పెట్టుకుని, ప్రచారం చేసుకుంటున్నాడు
ధాన్యం సేకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే
వరి వేస్తే ఉరే అంటాడు
రైతులను బికారీలుగా మార్చిండు
సన్న వడ్లు దొడ్డు వడ్లు అంటూ… రైతులను ఆగం చేసిండు
కేసీఆర్ ఫ్రీ కరెంటు ఇస్తున్నాడా?
ఫ్రీ కరెంట్ ఇవ్వడం అంటే… ఉత్పత్తి చేసే సంస్థలకు పైసలు కట్టాలి
డిస్కంలు 60 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి
డిస్కంలకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి చెల్లించాల్సిన బిల్లులే 18 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి
24 గంటల కరెంట్ ఇస్తున్నాడా కేసీఆర్?
కేసీఆర్ తెలంగాణలో ఏ ఒక్క గ్రామానికైనా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టయితే, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ చేశా..
ఒకవేళ ఇవ్వకుంటే… కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా?
కేసీఆర్ కు, కేసిఆర్ బిడ్డకు కింద మీటరు పెడితే… కవిత గాయి గాయి తిరుగుతోంది
కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో దొంగసారా దందా చేసింది
దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మాత్రం పైసలు ఉండవు… దోచుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయి
క్యాసినో లో కూడా లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు. అది కూడా బయటపడుతుంది త్వరలోనే…
లిక్కర్ దొంగ దందా చేసిన కవితను అరెస్టు చేస్తే… ఐలాపూర్ గ్రామస్తులు ధర్నా చేయాల్నా?
‘తెలంగాణ రాష్ట్ర సమితి’లో ఉన్న ‘తెలంగాణ’ నే తీసిపడేసిండు
కేసీఆర్ ఒక చెల్లని రూపాయి
నిన్న ‘బీఆర్ఎస్’ ఆవిర్భావ సమావేశం పేరుతో… అంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లను తీసుకొచ్చుకున్నాడు
అది బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కాదు… సంతాప సభ లా ఉంది
ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళ మొహాలన్నీ మాడిపోయాయి
తెలంగాణ మొత్తాన్ని టిఆర్ఎస్ నాయకులే దోచుకు తింటున్నారు
తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలి
పద్మశాలీలు నిజాయితీతో బతుకుతారు
ఖాదీ బోర్డు స్థలాల్లో కమర్షియల్, పెట్రోల్ బంకులు వెలుస్తాయా?
అమ్ముకోడానికి, లీజుకు తీసుకోవడానికి ఖాదీ బోర్డును వాడుకుంటారా?
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకు, బిచ్చపు బతకైంది
ఐలాపురం మండలం కావాలంటే.. బిజెపిని గెలిపించండి
ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. తెలంగాణలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతాం
BREAKING
13వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
కాసేపట్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని వెంకటాపూర్ గ్రామంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర
ప్రస్తుతం ‘కోరుట్ల – వెంకటాపురం’ మధ్య కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
BREAKING

“బిజెపి బహిరంగ సభ @ కోరుట్ల టౌన్”
యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే:
తెలంగాణ హిందూ సామ్రాట్ బండి సంజయ్
మీ అందరి అభిమాన నాయకుడు బండి సంజయ్
ఇసుక వేస్తే రాలనంత జనం ఈ సభకు వచ్చారు. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న
నిన్న ఒక పార్టీ రూపాంతరం చెందింది
ఎనకటికి టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, రేపు వీఆర్ఎస్
ఈ ప్రాంతం నేతన్నలకు నిలయం
రైతుబంధు పేరుతో… గతంలో రైతులకు వచ్చే అన్ని సబ్సిడీలను కేసీఆర్ బంద్ పెట్టిండు
రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది మోదీ ప్రభుత్వమే…

BREAKING
కాసేపట్లో కోరుట్లకు బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాక
బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్న మర్రి శశిధర్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్…
కాషాయ సంద్రమైన కోరుట్ల పట్టణం
‘బండి సంజయ్’ పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ‘ముస్లిం మహిళలు’
బండి సంజయ్ తో కలిసి నడుస్తున్న ‘ముస్లిం మహిళలు’
‘ట్రిపుల్ తలాక్’ ను రద్దు చేసి మాకు అండగా నిలిచిన బీజేపీని, మోదీని మరువలేమని బండి సంజయ్ తో చెప్పిన ‘ముస్లిం మహిళలు’
మతసామరస్యానికి నిదర్శనంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
ఎక్కడికక్కడ బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి, తమ అభిమానాన్ని చాటుకుంటున్న కోరుట్ల ప్రజానీకం
కాసేపట్లో కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రసంగించనున్న బండి సంజయ్
బ్రేకింగ్ న్యూస్…

13వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న, వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు
పాదయాత్రలో బండి సంజయ్ ని కలిసి, తమ సమస్యలను చెప్పుకుంటున్న నిరుద్యోగులు, రైతన్నలు
తెలంగాణ ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ ఒక లక్ష 91 వేల ప్రభుత్వ ఖాళీలు ఉన్నట్టు నివేదిక ఇచ్చింది…
ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నోటిఫికేషన్లను విడుదల చేయడం లేదు
కేసీఆర్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, నోటిఫికేషన్లు విడుదలయ్యేలా చూడండి అని బండి సంజయ్ కి చెప్పుకున్న నిరుద్యోగ యువత
మాకు రైతు రుణమాఫీ చేయడం లేదు.. మాలాంటి కౌలు రైతుల వైపు కేసీఆర్ సర్కార్… కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు.. మమ్మల్ని మీరే ఆదుకోండి సారూ…అంటూ బండి సంజయ్ ఎదుట తమ గోడు వెళ్ళబుచ్చిన అన్నదాతలు
వచ్చేది మన ప్రభుత్వమే… తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక, ప్రతి ఒక్కరు తప్పకుండా న్యాయం చేస్తామని హామీనిచ్చిన బండి సంజయ్
BREAKING

లంచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కిషన్ రావు పల్లె నుంచి కోరుట్లవైపు కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. కోరుట్లలో కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్.
BREAKING
13వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని యూసుఫ్ నగర్ శివార్లలో రాత్రి బస శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర
ఐలాపూర్, తిమ్మాయిపల్లి, కిషన్ రావు పల్లి, కోరుట్ల మీదుగా వెంకటాపూర్ వరకు కొనసాగనున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
ఈరోజు మొత్తం 13.5 కిలోమీటర్ల మేర కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర
ఇవాళ వెంకటాపూర్ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస

BREAKING
“ఓ రైతు కోరిక మేరకు ట్రాక్టర్ నడిపి, దుక్కి దున్నిన బండి సంజయ్”
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం, ఐలాపూర్ గ్రామ సమీపంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ని చూసి, బండి సంజయ్ వద్దకు వచ్చి, తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాల్సిందిగా కోరిన ఓ రైతు వెంటనే రైతు కోరికను తీర్చిన బండి సంజయ్. స్వయంగా ఆ రైతు పొలంలో ట్రాక్టర్ ఎక్కి కాసేపు దుక్కి దున్నిన బండి సంజయ్. అనంతరం పాదయాత్రగా ముందుకు సాగిన బండి సంజయ్.

BREAKING
“బిజెపిలో చేరికలు”
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని యూసుఫ్ నగర్ గ్రామ శివారులోని రాత్రి శిబిరం వద్ద, గ్రామ సర్పంచ్ తుకారం గౌడ్ ఆధ్వర్యంలో… బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 40 మంది నేతలు, కార్యకర్తలు. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్

Breaking News
నేటితో 13వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర. ఇవాళ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని యూసుఫ్ నగర్ శివార్లలో రాత్రి బస శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర. ఐలాపూర్, తిమ్మాయిపల్లి, కిషన్ రావు పల్లి, కోరుట్ల మీదుగా వెంకటాపూర్ వరకు కొనసాగనున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. ఈరోజు మొత్తం 13.5 కిలోమీటర్ల మేర కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఇవాళ వెంకటాపూర్ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.