“కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం గూండాల విభాగంగా మారింది”

కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం

రాజ‌కీయంగా ఎదుర్కోలేక దాడులు

రాహుల్ గాంధీ వ‌ల్లించే మొహబ్బత్ కి దుకాన్ బూటకం

కాంగ్రెస్ ది విద్వేషం, హింస‌ను ప్రేరేపించే దుకాణం

కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిద‌ర్శ‌నం

కాంగ్రెస్ గూండాల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాలి

భౌతిక దాడుల‌తో గులాబీ సైనికుల‌ను భ‌య‌పెట్ట‌లేరు

యాదాద్రి – భువన‌గిరి బీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యంపై దాడిని ఖండించిన ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలు చేసిన‌ దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ద్వేషం, హింస‌, విధ్వంసం ఉంద‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ప్రోద్భ‌లంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నార‌ని విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం దుర్మార్గమ‌ని స్ప‌ష్టం చేశారు. భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని తేల్చిచెప్పారు. ఈ దాడిని పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

రాహుల్ గాంధీ వ‌ల్లించే మొహబ్బత్ కి దుకాన్ ఒక బూటకమ‌ని తేట‌తెల్ల‌మైందని, అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి హింసా రాజ‌కీయాల‌ను తెలంగాణ తిర‌స్క‌రిస్తుందని, హింస‌కు, విద్వంస‌క‌ర చ‌ర్య‌ల‌కు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌ యువ‌జ‌న విభాగాన్ని గూండాల‌ విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిప‌డ్డారు. యాదాద్రి భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ, యువ‌జ‌న కాంగ్రెస్‌ జరిపిన దాడి వారి అసలు రంగును బట్టబయలు చేసిందని, కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు బుద్దిచెబుతార‌ని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంట‌నే అరెస్టు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read-

Rahul Gandhi’s Mohabbat ki Dukaan is a sham – a shop peddling hatred and violence. Telangana rejects such divisive politics – BRS MLC K Kavitha

The Congress Party is grooming its youth to practice hooliganism – BRS MLC Kavitha

The NSUI and IYC attack on the BRS District Office in Yadadri Bhuvanagiri exposes their real face. – BRS MLC K Kavitha

Hyderabad: The Congress Party is grooming its youth to practice hooliganism. The NSUI and IYC attack on the BRS District Office in Yadadri Bhuvanagiri exposes their real face. Sri Rahul Gandhi’s Mohabbat ki Dukaan is a sham – a shop peddling hatred and violence. Telangana rejects such divisive politics.

I strongly condemn this cowardly act of political vandalism and demand strict action. There is no place for such divisive, destructive actions in Telangana. The Congress must answer for this shameful incident!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X