కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగి ఐదుగురు యువకులు మృతి, ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి

హైదరాబాద్ : తెలాంగాణలోని సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా విహారానికని వెళ్తే అది కాస్త తీరని విషాదంగా మారింది. కొండపోచమ్మ సాగర్‌కు విహారానికి వెళ్లిన ఐడుగురు యువకులు స్నానం కోసం నీళ్లలో దిగగా ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు.

ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు. కాగా ఇద్దరు యువకులను ప్రాణాలతో బయటపడ్డారు. యువకులంగా హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ధనుష్ (20), లోహిత్ (17), చీకట్ల దినేశ్వర్ (17), సాహిల్ (19), జతిన్ (17) ఉన్నారు. సంక్రాతి సెలవులు రావటంతో ముషీరాబాద్ కి చెందిన ధనుష్, లోహిత్, చీకట్ల దినేశ్వర్, సాహిల్, జతిన్, మృగాంక్, ఇబ్రహీం ఏడుగురు స్నేహితులు కలిసి సిద్దిపేటలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చారు.

నీళ్లలో మునగకముంది సరదాగా

ఈ క్రమంలో కొండపోచమ్మ సాగర్ అందాలు ఆస్వాధిస్తూ నీళ్లలోకి దిగారు. నీళ్లలో కాసేపు ఆనందంగా కేరింతలు కొట్టారు. ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోయారు. అయితే యువకులకు ఈత రాకపోవటంతో ఒకరి చేతు ఒకరు గట్టిగా పట్టుకోవటంతో అందరూ నీటిలో మునిగిపోయారు. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడగా వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గల్లంతైన ఐదుగురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడ చదవండి-

మరోవైపు యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు యువకులు గల్లంతవటంపై ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రంగంలోకి దింపాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X