యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ… యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు మా ఇలవేల్పు. ఈ సందర్భంగా స్వామివారి కి పూజలు నిర్వహించడం జరిగింది. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారు.

గతంలో యాదాద్రి కి వచ్చిన వారు ఇప్పుడు వచ్చి చుస్తే యాదాద్రి కేనా వచ్చింది అన్నంత అభివృద్ధి జరిగింది. మహి మాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పి0చారని చెప్పారు. సీఎం కెసిఆర్ దార్శనికత తో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నాను అని మంత్రి తెలిపారు.

అంతకు ముందు మంత్రి గారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు మంత్రి గారికి స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించారు. కాగా, సీఎం కెసిఆర్ గారి స్ఫూర్తి తో తాను తన పాలకుర్తి నియోజకవర్గం లోని పలు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లుగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X