TSPSC : “నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం ఇవ్వాల్సిందే, లేకుంటే నిరుద్యోగ మిలియన్ మార్చ్”

  • లేకుంటే మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మార్చ్
  • ఉద్యోగ నియామకాల్లో పెద్ద గూడుపుఠాణి జరుగుతోంది
  • సీఎం కొడుకును బర్తరఫ్ చేయాల్సిందే
  • కేసీఆర్ ఫ్యామిలీ బరితెగింపు కన్పిస్తోంది
  • సీఎంఓ అధికారి కుట్ర స్పష్టంగా కన్పిస్తోంది
  • సింగరేణి నియామకాల్లోనూ ఆయన పాత్ర
  • వాస్తవాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే

హైదరాబాద్ : ‘‘టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఆయన కొడుకు నిర్లక్ష్యంవల్లే తప్పిదం జరిగింది. వెంటనే ఆయన కొడుకును బర్తరఫ్ చేయాలి. బీఆర్ఎస్ లో ఇతరులు తప్పు చేస్తే గెంటేస్తారే… మరి కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేస్తే చర్యల్లేవవా? ’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీవల్ల నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మిలియన్ మార్చ్ తరహాలో అతి త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగ నియామకాల్లోనే పెద్ద కుట్ర కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఈరోజు సిద్దిపేటలో ఓ ప్రైవేటు ఫంక్షన్ కు విచ్చేసిన బండి సంజయ్ ను మీడియా ప్రతినిధులు కలిశారు.

ఈ సందర్భంగా సంజయ్ విలేకర్లతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలివే…

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సీఎం ఆఫీస్ నుండే జరిగింది. సీఎంఓలో పదవీ విరమణ పొందిన ప్రధాన అధికారి పాత్ర ఈ పేపర్ లీకేజీలో ఉంది. సింగరేణి ప్రశ్నాపత్రాల నియామకాల్లోనూ ఆయన పాత్ర ఉంది.

• సదరు అధికారి టీఎస్పీఎస్సీలో ముగ్గురు వ్యక్తులను నియమించే సమయంలోనూ ఆయన పాత్రే ఉంది.

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో పెద్ద గూడుపుఠాణి ఉంది. ఈ విషయంపై విచారణ చేసిన పోలీస్ అథికారి రెక్కి చేసి నిందితులను దొరకపట్టిన తరువాత కూడా…. బయట ఎక్కడ ఈ విషయం చెప్పినా నీ సంగతి చూస్తామని ఒక అమ్మాయిని బెదిరించాడు.

• కచ్చితంగా సీఎంఓలో పనిచేసే అధికారి హస్తం ఉంది… దీనిని మాయమార్చేందుకే ఇదంతా.. ఇందులో సీఎంకు ఏటీఎంలా మారిన వాళ్లందరి పాత్ర బయట పడుతోంది. ఆశ్చర్యేమేమిటంటే..చేయించింది మీరే.. తప్పించుకునేది మీరే…

• దీనిపై పక్కా విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలే.. సీఎం కొడుకు పాత్రపైనా ఎంక్వైరీ జరపాలే. నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలే. లేనిపక్షంలో.. నిరుద్యోగ మార్చ్ చేస్తాం… మిలియన్ మార్చ్ మాదిరిగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X