Operation Kagar- చర్చలు ఒక్కటే మార్గం, భౌతికంగా చంపడం వల్ల సమస్య పరిష్కారం కాదు: ఎంపీ మల్లు రవి

హైదరాబాద్ : నేడు ఇందిరా పార్కులో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం తక్షణం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఇట్టి మహాధర్నా కార్యక్రమం లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

Also Read-

బస్తర్ లో ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం జరుపుతున్న ఆదివాసీల జాతి హానాన్ని, అంతర్యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని, పేసా చట్టని రాజ్యాంగపు 5వ షెడ్యూల్లో ఆదివాసీలకు సంక్రమించిన హక్కులను అమలు చేయాలని, తక్షణం కల్పన విరమణను ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, శాంతి చర్చలతోనే సమస్యల పరిష్కారం అవుతుందని ఎంపీ మల్లు రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X