हैदराबाद : लोक सभा आम चुनाव के दौरान उम्मीदवारों द्वारा जमा किए गए संपत्ति के हलफनामे में चौंकाने वाली बातें सामने आ रही हैं। देश के दो सबसे अमीर सांसद उम्मीदवार तेलुगु राज्यों से हैं। नामांकन के लिए दाखिल किए गए हलफनामों के अनुसार दो तेलुगु राज्यों में भारी संपत्ति वालों में आंध्र प्रदेश के गुंटूर से टीडीपी उम्मीदवार के रूप में चुनाव लड़ रहे पेम्मसानी चंद्रशेखर पहले स्थान पर है, जबकि तेलंगाना के चेवेल्ला से चुनाव लड़ रहे बीजेपी सांसद उम्मीदवार कोंडा विश्वेश्वर रेड्डी दूसरे स्थान पर है।
गुंटूर से सांसद उम्मीदवार पेम्मासानी चंद्रशेखर ने हलफनामे में बताया है कि उनके पास 5,785 करोड़ की संपत्ति है। उन्होंने कहा कि अमेरिका में उनके पास विभिन्न रूपों में 28.93 करोड़ की संपत्ति है। उनके नाम पर 519 करोड़ और उनकी पत्नी कोनेरू श्रीरत्ना के नाम पर 519 करोड़ का कर्ज है। इसी तरह हलफनामे में 2,316 करोड़ की संपत्ति होने का खुलासा किया गया है। उन्होंने बताया कि उनके पास 181 ग्राम सोने के आभूषण हैं और उनकी पत्नी के पास 2.5 किलोग्राम सोने के आभूषण हैं।
![](https://telanganasamachar.online/wp-content/uploads/2024/04/lok-sabha.png)
चेवेल्ला से बीजेपी सांसद उम्मीदवार कोंडा विश्वेश्वर रेड्डी ने हलफनामे में कहा कि उनके परिवार के पास 4,490 करोड़ की संपत्ति है। विश्वेश्वर रेड्डी के नाम पर 1,178 करोड़ की संपत्ति, पत्नी संगीता रेड्डी के नाम पर 3,203 करोड़ की संपत्ति है। उनके नाम पर विभिन्न बैंकों में 17 करोड़ रुपये का कर्ज है। हलफनामे में कहा गया है कि विश्वेश्वर रेड्डी के पास फिलहाल 60 लाख नकद हैं और उनकी पत्नी के पास 10.44 लाख के आभूषण और हीरे हैं।
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆస్తుల్లో అగ్రస్థానం
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్‌లలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగు వారు కావడం విశేషం. కాగా నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఆస్తుల వివరాలు పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కలిగిన ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి స్థానంలో నిలిచారు.ఇక తెలంగాణ నుంచి చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 5,785 కోట్ల ఆస్తులు కలిగివున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో వివిధ రూపాల్లో 28.93 కోట్ల ఆస్తి, ఆయన పేరు మీద 519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో 519 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 2,316 కోట్ల విలువైన చరాస్తులున్నాని అఫిడవిట్‌తో వెల్లడించారు. వారి వద్ద 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.
ఇక చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి తన కుటుంబం పేరిట 4,490 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్‌తో తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద 1,178 కోట్లు ఆస్తులుండగా, భార్య సంగీత రెడ్డి పేరుతో 3,203 కోట్లు ఉన్నాయి. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో 17 కోట్ల అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి వద్ద ప్రస్తుతం చేతిలో 60 లక్షల క్యాష్, ఆయన భార్య వద్ద 10.44 లక్షలు విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. (ఏజెన్సీలు)