వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతుల పంటల కొనుగోలు విషయంలో ముందుకు కదలాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యంతో పాటు మొక్కజొన్న, వేరుశనగ మరియు ఇతర పంటలు మార్కెట్ యార్డులకు చేరుకున్నా వాటిని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు మార్కెట్ యార్డుల దగ్గర పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగా జనగామ నియోజకవర్గంలోని యశ్వంతపూర్, ఆ తర్వాత పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం ఊకల్ సొసైటీతో పాటు నర్సంపేట మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతన్నలు కేటీఆర్‌కు తమ ఆవేదన, గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నెల రోజులు కావస్తున్నా పంటల కొనుగోలుకు సంబంధించిన విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని తమ పంటను, ధాన్యం రాశులను… ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కేటీఆర్ వెంట ఉన్నారు. 15 రోజులుగా పంట కొనుగోళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్. ఎన్నిసార్లు మార్క్‌ఫెడ్ అధికారులకు కలెక్టర్ దగ్గరికి వెళ్లి పంట కొనాలని విన్నవించినా పట్టించుకోలేదని వాపోయిన రైతన్నలు.
Also Read-
వెంటనే మార్క్‌ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి పంట కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, మార్క్‌ఫెడ్ వైఫల్యాన్ని నిలదీసిన కేటీఆర్. పంట కొనేది ఉన్నదా లేదా చెప్పాలి రైతన్నలకు అని అన్న కేటీఆర్.
పంట కొనుగోళ్ల అంశంలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొక్కజొన్న పంట కొనుగోలు చేయలేక కనీస స్థాయిలో కూడా మొక్కజొన్నను కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం. 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొన్నామని చెప్తున్న ప్రభుత్వం, కానీ క్షేత్రస్థాయిలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న కేటీఆర్. మరి 6 లక్షలు కొంటే రైతన్నలు ఎందుకు ఇన్ని అవస్థలు పడుతున్నారని ప్రశ్నించిన కేటీఆర్.
రైతన్నలకు కనీస మద్దతు ధర రూ. 2,460 ఇవ్వాలన్న ఏకైక ఉద్దేశంతోనే పంట కొనుగోలు చేయడం లేదని ఆరోపించిన కేటీఆర్. కనీస మద్దతు ధరతో పాటు పంటకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే పంట కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసింది.
మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంట కొనుగోలు చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుంభకోణం వలన మార్క్‌ఫెడ్ పేరుతో తీసుకువచ్చిన సుమారు 23 వేల కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం ఇతర అవసరాలకు తరలించింది. దీంతో మార్క్‌ఫెడ్ దగ్గర నిధులు లేవు, కొత్తగా డబ్బులు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ సివిల్ సప్లైస్ కుంభకోణాన్ని కప్పి ఉంచుకోవడానికి పంటల కొనుగోళ్లు లేకుండా కాంగ్రెస్ చేసింది అన్న కేటీఆర్.
రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే వెంటనే రైతుబంధు వేయడంతో పాటు పంటల కొనుగోళ్లను ఎలాంటి షరతులు లేకుండా పూర్తి చేయాలి. రైతన్నల పంట కొనుగోలు చేయకుంటే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధిస్తాం. ఇదే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటించి పోయిండు, కానీ దాని అమలులో అతి గతి లేదు. రైతులు ధైర్యంతో ఉండాలి, పండించిన పంట కొనేదాకా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తాం.
