హైడ్రా మైనింగ్ కుంభకోణం-రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి: MLC డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్

హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఈరోజు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హైడ్రా (HYDRAA) వైఫల్యాలను మరియు అధికార పక్షం సాగిస్తున్న మైనింగ్ దోపిడీని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఈ సమావేశంలో ఆయన వెల్లడించిన ప్రధానాంశాలు వరుస క్రమంలో:

  1. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ‘యూ-టర్న్’ 3 గంటల్లోనే మాట మార్పు?
    ఉదయం 9:15 గంటలకు మంత్రి పొంగులేటికి చెందిన ‘రాఘవ స్టోన్ క్రషర్’ పై చర్యలు తీసుకున్నామని అధికారికంగా ప్రకటించిన హైడ్రా, మధ్యాహ్నం 12 గంటలకల్లా అది రాఘవ కన్స్ట్రక్షన్ ది కాదని మాట మార్చడం వెనుక ఉన్న మతలబు ఏంటి?
    కేవలం మూడు గంటల వ్యవధిలో హైడ్రా కమిషనర్‌ను ఎవరు బెదిరించారు? ఎవరి ఒత్తిడికి లొంగి ఈ అబద్ధపు రిజాయిండర్ ఇచ్చారు?
    ఐపీఎస్ అధికారిగా రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాల్సింది పోయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లోబడి వ్యవహరించడం సిగ్గుచేటు.
    సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరియు ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు రంగనాథ్ గారిపై కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
  2. నిందితులతో కుమ్మక్కైన అధికార యంత్రాంగం – అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
    వందల కోట్ల విలువైన ప్రకృతి సంపద దోపిడీకి గురవుతుంటే కలెక్టర్, ఆర్డీవో (RDO), తహశీల్దార్ (MRO), పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) అధికారులు మరియు స్థానిక పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
    అనుమతులు లేకుండా బాహుబలి మెషిన్లు పెట్టి మైనింగ్ చేస్తుంటే వీరంతా గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?
  3. అక్రమ మైనింగ్‌కు సహకరించిన ఈ అధికారులందరిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
    ప్రజల సొమ్ముకు జవాబుదారీతనం వహించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బానిసత్వ మనస్తత్వంతో వ్యవహరించడం తెలంగాణకే ప్రమాదకరం.
  4. హైడ్రా ‘కుంభకర్ణ’ నిద్ర – 60 రోజుల ఆలస్యం ఎందుకు?
    మానసా హిల్స్ మైనింగ్ మాఫియాపై హరీశ్ రావు గారు ఫిబ్రవరిలోనే గొంతెత్తారు, బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ మార్చిలో ఫిర్యాదు చేసింది.
    వందల కోట్ల రూపాయల విలువైన రాయిని మంత్రి కంపెనీలు దోచుకున్నాక, 60 రోజుల తర్వాత హైడ్రా ఇప్పుడు మేల్కొనడం ఇల్లు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంది.
    పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణకు ఏమైనా అల్లుడా? సామాన్యుడిపై చూపించే ప్రతాపం మంత్రుల విషయంలో ఎందుకు చూపడం లేదు?
  5. రేవంత్ రెడ్డి – పొంగులేటి ‘దోపిడీ’ ఒప్పందం: భాగ్యనగర్ క్రషర్స్ అక్రమాలు
    ఒక పక్క పొంగులేటి, మరో పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ‘భాగ్యనగర్ క్రషర్స్’ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నాయి.
    ప్రైవేట్ వ్యక్తులు హోర్డింగ్‌లు పెట్టకూడదనే నిబంధన ఉన్నా, భాగ్యనగర్ క్రషర్స్ గోడలపై భారీ హోర్డింగ్‌లు పెట్టి వందల కోట్లు సంపాదిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
    రేవంత్ రెడ్డి మరియు పొంగులేటి రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్న రియల్ ఎస్టేట్ దందాగాళ్లు.

అంతిమ డిమాండ్లు:

Also Read-

  1. మంత్రి పొంగులేటి బర్తరఫ్: అక్రమ మైనింగ్‌లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలి.
  2. CBI విచారణ:* పొంగులేటి మైనింగ్ అక్రమాలు, అధికారుల కుమ్మక్కు మరియు హైడ్రా కమిషనర్ 3 గంటల్లోనే మాట మార్చిన తీరుపై సమగ్ర *CBI విచారణ జరపాలి.
  3. సొమ్ము రికవరీ: దోచుకున్న ₹500 కోట్ల విలువైన సంపదను నిందితుల నుండి తిరిగి రాబట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి.
  4. అధికారుల అరెస్ట్: దోపిడీకి సహకరించిన కలెక్టర్, MRO, RDO, PCB మరియు పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X