ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ, 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఆత్మహత్యకి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. మంగళవారం నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని శంకర్ గౌడ్ నివాసానికి వెళ్లిన ఆయన, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పార్టీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాహాయాన్ని అందజేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మలోతు కవిత తదితరులు ఉన్నారు.

ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: కేటీఆర్ ఘాటు విమర్శలు

కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. “అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆర్టీసీని విలీనం చేస్తామని, పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెండేళ్లు గడిచినా పట్టించుకోలేదు. ప్రభుత్వం మాట తప్పడం వల్లే శంకర్ గౌడ్ లాంటి కార్మికులు బలి కావాల్సి వస్తోంది.”

ఇది కూడ చదవండి-

“బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేసీఆర్ గారు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. శంకర్ గౌడ్ మరణించినప్పుడు పరామర్శించడానికి వస్తే ప్రభుత్వం మమ్మల్ని అరెస్టులు చేయించింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని 12 పోలీస్ స్టేషన్లు తిప్పి హింసించారు. ఈరోజు మేము వస్తున్నామని తెలిసి, ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్కు ఇచ్చిందంటే వారి వైఫల్యం అర్థమవుతోంది.

ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ప్రాణత్యాగాలు చేయవద్దు. మీకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ మెడలు వంచైనా మీ హక్కులు సాధిస్తాం.” రాజకీయాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులందరూ కలిసికట్టుగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X