Government is trying to Betray Farmers and Backward Classes
Hyderabad : On the occasion of the New Year, BRS Working President K.T. Rama Rao (KTR) extended heartfelt wishes to the people of Telangana while addressing the media on state political developments. KTR called on party workers to intensify their fight against the Congress government’s failures and misdeeds. He urged them to work tirelessly to bring back a BRS-led government in the next elections. He took the opportunity to highlight the failures of the Congress government and outlined the future plans of the Bharat Rashtra Samithi (BRS). During the interaction, KTR alleged that the Congress government is working solely for the wealthy elite while neglecting the needs of the poor and marginalized communities.
KTR questioned the need for imposing self-declaration forms on farmers under the Congress’s proposed “Rythu Bharosa” scheme. He accused the government of using these tactics to cut benefits and betray farmers, stating that the program is being diluted to fit a limited budget. KTR criticized the Congress’s year-long governance, calling it a failure marked by inefficiency and corruption. He cited examples of forced evictions, land-grabbing incidents, and policy mismanagement as evidence of the government’s anti-poor stance.
KTR announced that BRS will launch extensive outreach programs, including a massive public meeting around the party’s foundation day on April 27 and a membership drive. He also revealed plans to conduct leadership training sessions and elect a party president later this year, affirming that BRS cadres unanimously support KCR’s leadership. KTR accused Congress ministers and MLAs of turning their offices into hubs of corruption. He demanded transparency on the state’s borrowing practices, asking how much of the ₹1.35 lakh crore debt benefits central Congress leaders.
Expressing confidence in BRS’s performance in upcoming local body elections, KTR criticized the Congress government for failing to reserve 42% seats for Backward Classes. He alleged that the government is deliberately avoiding implementation of BC reservations. KTR also addressed the alleged irregularities in the Formula E case, claiming baseless accusations and political vendettas. He reiterated his trust in the judiciary and vowed to fight any unjust legal actions against him.
Also Read-
కొత్త సంవత్సరంలో కొత్త మోసాలతో కాంగ్రెస్ కుట్ర చేస్తుంది- కెటిఅర్
రాష్ట్ర రైతాంగాన్ని, బీసీలను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు
రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
రాష్ట్ర రాజకీయ పరిణామాల పైన మీడియాతో మాటామంతి
సంవత్సరకాలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మైనస్ మార్కులే
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలు కనపడడం లేదని కేవలం పెద్దల కోసమేఈ ప్రభుత్వం పనిచేస్తుంది
రైతు భరోసా విషయంలో రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు?
రైతు భరోసా కార్యక్రమానికి విధించనున్న కోతలతో రాష్ట్ర రైతాంగంలో తిరుగుబాటు
రైతులను మోసగించే ఏకైక ఉద్దేశంతోనే రైతు భరోసాను కుదించే ప్రయత్నం
తనపైన కేసులు నమోదు చేయాలన్న దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరుసార్లు ప్రయత్నం చేసిందన్న కేటిఆర్
నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందన్న కెటిఅర్
అయితే రేవంత్ రెడ్డికే కాడు అయన తాతా ముత్తాలకు కూడా భయపడేదిలేదు
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో కాంగ్రెస్ మంత్రులు,ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారు
ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క అవినీతి దుకాణం తెరిచారు
ప్రభుత్వం చేసిన లక్ష 35 వేల కోట్ల అప్పులో ఢిల్లీ కాంగ్రెస్ కు ఎంత డబ్బు పోతుందో తెలపాలి
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తీసుకువచ్చే ఏకైక లక్ష్యంతో పార్టీ శ్రేణులు అన్ని పని చేస్తున్నాయని తెలిపిన కేటీఆర్, పార్టీ శ్రేణులంతా కాంగ్రెస్ పార్టీ అసమర్ధ ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారితో కాసేపు రాష్ట్ర రాజకీయ పరిణామాల పైన మాట్లాడారు.
ఈ సంవత్సరకాలం ప్రభుత్వ వైఫల్యాలను ఒకవైపు ఎండగడుతూనే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న జరుగుతుందని, దాదాపు ఇదే సమయంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసే ఆలోచన చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపిన కేటీఆర్ ఆ తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులను కూడా నిర్వహించుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్ నెల లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. 60 లక్షల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల అభీష్టం మేరకు మరోసారి పార్టీ అధినేత కేసీఆర్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని కేటీఆర్ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి సర్కార్ కు లేదు- కేటీఆర్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి సర్కార్కు లేదని కేటీఆర్ అన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ఒక కుట్రకు తెర లేపిందని కేటీఆర్ తెలియజేశారు. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మొన్న శాసనసభలో చేసిన స్థానిక సంస్థల చట్ట సవరణలలో బీసీలకు మరింత రిజర్వేషన్లను అందజేసేందుకు సుప్రీంకోర్టు కేసు ప్రస్తావనతో పాటు, త్రిపుల్ టెస్ట్, ప్రత్యేక బీసీ కమిషన్ సిఫార్సుల నివేదిక వంటి కారణాలను ప్రస్తావించిందని కేటీఆర్ వివరించారు. ఇవన్నీటిని అడ్డుపెట్టుకొని ఎవరితోనో ఒకరితో కోర్టులో కేసు వేయించి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.
రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు?
రాష్ట్ర సర్కారు ప్రస్తుతం ఆలోచిస్తున్న రైతు భరోసా కార్యక్రమానికి విధించనున్న కోతలతో రాష్ట్ర రైతాంగంలో తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ అన్నారు. రైతులను మోసగించే ఏకైక ఉద్దేశంతోనే రైతు భరోసాను కుదించే ప్రయత్నం చేస్తుందన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా పంట పొలాల సాగు అంశంలో సెల్ఫ్ డిక్లరేషన్ అంశాన్ని రైతులపై రుద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. 14.50 లక్షల కోట్ల రూపాయల అప్పులను బ్యాంకులు మాఫీ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతుల విషయంకి వచ్చేసరికి ఎందుకన్న కెటిఅర్, ఈ రాష్ట్ర ప్రభుత్వం సెల్ప్ డిక్లకేరేషన్ రుద్దుతుందని కేటీఆర్ అన్నారు. కేవలం ప్రస్తుతం ఉన్న ఏడున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్ దాటకుండా రైతు భరోసాను నామమాత్రంగా అమలు చేసే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల్లో పెంచి ఇస్తామని చెప్పిన రైతు భరోసాను కాంగ్రెస్ ఇచ్చే ఆలోచన లేదన్నారు. ఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుబరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.
ఫార్ములా ఈ కేసు విషయంలోనూ కేటీఆర్ మాట్లాడారు. అసలు అవినీతి లేనప్పుడు కేసు ఎందుకని కేటీఆర్ అన్నారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పులతడకగా ఉందని, సంబంధంలేని అన్ని అంశాలను అందులో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరికించారని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాంమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ వేధింపుల కోసం ఈ కేసును వాడుకోవాలని చూస్తున్నా, న్యాయస్థానాలపైన, దేశ న్యాయవ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. తనపైన కేసులు నమోదు చేయాలన్న దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరుసార్లు ప్రయత్నం చేసిందని కేటిఆర్ వివరించారు. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అయితే రేవంత్ రెడ్డికే కాడు అయన తాతా ముత్తాలకు కూడా భయపడేదిలేదన్నారు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్నాని, వద్దని రేవంత్ తీసుకున్న నిర్ణయంతోపాటు ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్ లో చర్చ జరగలేదన్నారు. మరీ రేవంత్ పైనా కూడా కేసుపెట్టాలన్నారు. నాపై కేసు పెడితే.. రేవంత్ పై కూడా కేసు పెట్టాలి. ఇతర దేశాల్లో కూడా ఫార్ములా ఈ రద్దు జరిగిందని, ఇక్కడ ఫార్ములా ఈ రద్దు వల్ల 600 కోట్లు నష్టం జరిగిందన్నారు. ఏకపక్షంగా ఎలా రద్దు చేశారో చెప్పాలని, రద్దు చేయడం వలన భారీగా నష్టం జరిగిందన్నారు.
సంవత్సరం కాలంలో ప్రభుత్వం కు మైనస్ మార్కులు మాత్రమే.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలు కనపడడం లేదని కేవలం పెద్దల కోసమేఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సుప్రీం కోర్టు ల నుండి తిట్లు పడ్డ ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. చివరికి కోర్టుకు క్షమాపణ చెప్పాడు ఈ ముఖ్యమంత్రి అని కెటిఅర్ అన్నారు. ఖాజా గూడలో కూడా నిన్న పేద ప్రజల ఆస్తులపై కన్ను వేశారు. అందుకే అక్కడ ఉన్న నాలుగు ఎకరాల పేదల భూములను గుంజుకొని పెద్దలకు ఇచ్చేందుకు పేదల ను తరలించారు. వారి ఇండ్లను బలవంతంగా కూలగొట్టారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు.
సంవత్సరకాలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మైనస్ మార్కులే
ఈ రాష్ట్ర ప్రభుత్వ సంవత్సర కాలంలో పాలించిన తీరుకు ప్రజల నుంచి మా పార్టీ నుంచి ఇచ్చేది మైనస్ మార్కులు అని కేటీఆర్ అన్నారు. వీళ్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు అని పరిహాసమని కేటీఆర్ అన్నారు. పరిపాలన పేరుతో ప్రజలను క్రూరంగా హింసిస్తున్న తీరు తెలంగాణ సమాజం గమనిస్తుంది అన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారా. ఎవరిని అడిగిన, ఒక్కరైనా ఈ ముఖ్యమంత్రి ని మంచిగా మాట్లాడుతున్నారా. సమాజంలో ఏ ఒక్కరిని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిడుతున్నారన్నారు. ఇన్ని తిట్లు కనుక ఇంకొక వ్యక్తి గనుక తిని ఉంటే ఎప్పుడో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేదని రేవంత్ రెడ్డి పైన సెటైర్ వేశారు.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో కాంగ్రెస్ మంత్రులు,ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క అవినీతి దుకాణం తెరిచారు. అప్పు చేయకపోవడమే అభివృద్ధి అన్న రేవంత్, ఇప్పుడు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. లక్ష 35 వేల కోట్లలో ఢిల్లీ కాంగ్రెస్ కు ఎంత డబ్బు పోతుందో తెలపాలన్నారు. ఆర్ ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీ పెద్దలకు ముడుపులు పోతున్నాయో చెప్పాలన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో కాంగ్రెస్ మంత్రులు,ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క అవినీతి దుకాణం తెరిచారు. ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కోమటిరెడ్డి దాకా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించే పని పెట్టుకున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పై నిర్ణయం తీసుకోలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టే గతంలో ఉద్యమ సమయంలో మేమే కొత్త సంప్రదాయం తెచ్చామన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర మేము చాలా స్పష్టంగా నిర్వహిస్తున్నామని, మేము ప్రభుత్వ అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తున్నామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు లో అవినీతి జరుగుతుందని మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, కేంద్రం పూర్తిగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టులో 12000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రజలపై మోపుతున్నారన్నారు. ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఒక్కరైనా సమాధానం చెప్పారఅని ప్రశ్నించారు.