రెనోవా, ఆర్వీఎం వైద్యవిద్యా సంస్థలతో డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాలు

హైదరాబాద్ : ఎం.బి.ఏ. హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ (HHCM) కోర్సును అందించడానికి డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్లో వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి సమక్షంలో రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్, ఆర్వీఎం విద్యా సంస్థలతో సోమవారం వేర్వేరుగా అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఎల్. విజయ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

Also Read-

ఒప్పంద పత్రాలపై రెనోవా విద్యా సంస్థ ప్రిన్సిపాల్ డా. వజీహుద్దీన్ అహ్మద్ వారిస్, ఆర్వీఎం విద్యా సంస్థ ప్రిన్సిపాల్ పి. రవీందర్ సంతకాలు చేశారు. సమావేశంలో డైరెక్టర్ (అకడమిక్) ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డీన్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. రాబింద్రనాథ్ సోలమన్, డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. కిరణ్మయి, డా. పి. రాధాకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X