కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో 42% బీసీ కులాలకు రిజర్వేషన్ల అమలుకై ఈ నెల 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభ
మద్ధతు ప్రకటించిన సర్పంచ్ ల సంఘం జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ
జిల్లాల నుంచి భారీ స్పందన
హైదరాబాద్: బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తడితేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ ను ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్ తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది.
ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్ధతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సర్పంచ్ ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటన చేశారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతాయని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
Also Read-
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు బీసీ మహాసభ పోస్టర్లను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ… కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషికి తాము మద్ధతు ప్రకటిస్తున్నామని, విద్యార్థి లోకమంతా ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమల్లో పాల్గొంటామని ప్రకటించారు. కవిత గారి నివాసంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొల్లా శివశంకర్, పెంట రాజేష్, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి, విజేందర్ సాగర్, రాచమల్ల బాలకృష్ణ, కోళ్ల శ్రీనివాస్, సాల్వా చారి, మురళి, నిమ్మల వీరన్న, లింగం, అశోక్ తదితరులు పాల్గొన్నారు
హలో BC చలో హైదరాబాద్
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
పడిగే ప్రశాంత్ ముదిరాజ్
తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర యువత అధ్యక్షులు
జనవరి 3వ తేదీన సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీల భారీ సభ కు బీసీ కులలు కుల సంఘాల నాయకులు, మేధావి వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయగలరు. ఈ కార్యక్రమంలో పడిగే ప్రశాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడం పై ఆలోచన చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక, బీసీ జనాభాను వెల్లడించిన అనంతరమే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
అంతేకాకుండా అన్ని బీసీ ఉప కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి భవనాలు నిర్మించాలని అదేవిధంగా రాష్ట్రంలో ముదిరాజులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ తిరిగి ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజ్ కులాన్ని బీసీ డీ నుంచి బీసీఏలోకి చేర్చాలని అన్నారు. బీసీ కులాల్లో ఉన్నటువంటి సంచార జాతులకు ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలన్నారు.సబ్సిడీలతో రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పల శేఖర్ యాదవ్. ఆకుల సతీష్.అనిల్ యాదవ్ లు పాల్గొన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలుకై ఏమ్మెల్సీ కవితక్క ఆధ్వర్యంలో బీసీల మహాసభ
జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇంద్ర పార్క్ లో కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు పరచాలని స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు సాధనకై బీసీ మహాసభ కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ముందు బీసీ మహాసభ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు బొడ్డుపల్లి లింగం (తెలంగాణ జాగృతి), మన అశోక్ యాదవ్ (ఉస్మానియా విద్యార్థి జె ఏ సి వ్యవస్థాపకులు) మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినట్లయితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాబట్టి బీసీలుగా మేము ఊరుకునేది లేదు బీసీలుగా మేము సమగ్ర కులగణన సర్వే ప్రకారం మేము 60% ఉన్నము.
మూడు నాడు జరిగే బీసీల మహాసభను విజయవంతం చేయండి
గుంజపడుగు హరిప్రసాద్
బీసీ కుల సంఘాల ఐక్యవేదిల రాష్ట్ర నాయకులు
జనవరి మూడవ తారీకు హైదరాబాద్ లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్కు వద్ద భారత జాగృతి అధ్యక్షురాలు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో జరిగే బీసీల మహాసభను పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలను రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు కామారెడ్డి లో చేసిన డిక్లరేషన్ ప్రకారంగా సంపూర్ణ బీసీ కుల గణన జరిగిన తర్వాత బీసీల లెక్కలు తేట తెల్లం అయ్యాక అప్పుడు వచ్చిన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సభకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు, బీసీ ఉద్యోగులు, బీసీ మేధావులు, బిసి విద్యార్థులు కదిలి వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ కోరారు.
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయండి
ఈ నెల మూడో తారీకు రోజున ఇందిరా పార్క్ దగ్గర సావిత్రి పూలే జన్మదిన సందర్భంగా జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని శాతవాహన యూనివర్సిటీ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ నాయకులు నైతం మహేష్ గారు మాట్లాడుతూ బీసీ లో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని, సావిత్రిబాయి పూలే ఆశయాలను కాపాడే వారసుల్లాగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని కామారెడ్డిలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకునేలా చూడాలని ఈ సభతో ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే విధంగా ఈ సభను విజయవంతం చేయాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడకుంట రమేష్, గోపతి అన్వేష్ ,వడ్లకొండ మనోహర్, శివ పవన్, అఖిల్,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.