हैदराबाद: पूर्व मंत्री और सीनियर नेता जीवन रेड्डी को बीआरएस के अध्यक्ष केसीआर ने एक अहम पद दिया है। उन्होंने घोषणा की गई कि जीवन रेड्डी को बीआरएस पार्टी का महासचिव पद दिया जाएगा। केसीआर ने यह घोषणा सोमवार को जगित्याल में हुई प्रजा आशीर्वाद सभा में की है।
इस बीच, हाल ही में कांग्रेस पार्टी से इस्तीफा दे चुके पूर्व मंत्री जीवन रेड्डी बीआरएस पार्टी में शामिल हो गए हैं। जगित्याल में हुई प्रजा आशीर्वाद सभा में जीवन रेड्डी को बीआरएस का अंगवस्त्र पहनाकर बीआरएस पार्टी में शामिल होने का केसीआर ने न्योता दिया गया। जीवन रेड्डी के साथ उनके समर्थक भी बड़ी संख्या में बीआरएस में शामिल हो गये।
इस मौके पर केसीआर ने कहा कि जीवन रेड्डी सिर्फ राज्य के हितों के लिए बीआरएस पार्टी में शामिल हुए हैं। उन्होंने हिम्मत से फैसला लेने के लिए जीवन रेड्डी की तारीफ की। उन्होंने कहा कि वह 45 साल से जीवन रेड्डी के दोस्त हैं। उन्होंने कहा कि अलग-अलग पॉलिटिकल पार्टियों की वजह से उन्होंने अलग-अलग तरीके से काम किया। जीवन रेड्डी की पब्लिक लाइफ कई लोगों के लिए एक आइडियल है। उन्होंने कहा कि जीवन रेड्डी के फैंस सिर्फ जिले में ही नहीं बल्कि पूरे राज्य में हैं।

केसीआर ने जीवन रेड्डी से कहा कि हमें भाइयों की तरह काम करना चाहिए। उन्होंने कहा कि जीवन रेड्डी को तुरंत बीआरएस पार्टी का महासचिव पद नियुक्त किया जाएगा। वह चाहते हैं कि जीवन रेड्डी सिर्फ करीमनगर में ही नहीं बल्कि आस-पास के जिलों में भी काम करें। केसीआर ने भरोसा जताया कि बीआरएस सरकार ही सौ फीसदी तेलंगाना वापस सत्ता में आएगी।
Also Read-
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవి, ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఈ మేరకు కేసీఆర్ ప్రకటన చేశారు.
కాగా, ఇటీవలకాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ కండువా కప్పి జీవన్ రెడ్డిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని అన్నారు. జీవన్ రెడ్డి గుండె ధైర్యంతో నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 45 ఏళ్లుగా జీవన్ రెడ్డితో తనకు స్నేహం ఉందని.. భిన్న రాజకీయ పార్టీల వల్లే వేర్వేరుగా పని చేశామని చెప్పారు. జీవన్ రెడ్డి ప్రజాజీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. జీవన్ రెడ్డికి జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని అన్నారు.
అన్నదమ్ముల్లాగా పని చేద్దామని జీవన్ రెడ్డితో చెప్పానన్నారు. జీవన్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నానని.. ఆయన ఒక్క కరీంనగరే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పని చేయాలన్నారు. నూటికి నూరు శాతం తెలంగాణ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం సక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారని తెలిపారు. వాళ్ల నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తదా.. బాధ్యత లేకుండానే వస్తదా అని ప్రశ్నించారు. ఏం చూసినా సక్కగా లేకపోతే.. పొద్దున లేస్తే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని అడిగారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం.. ఉద్యోగస్తులు ఆగం.. రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం.. విద్యార్థుల జీవితం ఆగం.. ఆటో కార్మికుల జీవితాలు ఆగం.. ఎవరు సక్కగున్నరు అని కేసీఆర్ అడిగారు. సంతృప్తిగా ఎవరున్నారని అన్నారు. ఈ అందానికి బోడి ముండ హైడ్రాను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా ఉందని.. నిజామాబాద్‌కు నిడ్రా తీసుకొస్తామని పీసీసీ ప్రెసిడెంట్ ఒకరు చెబుతున్నారని మండిపడ్డారు. రేపు జగిత్యాలకు జిడ్రా అంటాడని సెటైర్ వేశారు. మీకేం కావాలి.. పేదోళ్ల కొంపలు కూల్చడమేనా అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వంలో మూడున్నర లక్షల మందికి ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలిచ్చామని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ ఇవాళ ఏం కూలగొడుతున్నారని మండిపడ్డారు. పిల్లలను పుస్తకాలు కూడా తీసుకోనివ్వరా.. అంత ఎగిర్తమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని హామీ ఇచ్చారు. మొదటి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 46వేల చెరువులు మంచిగా చేశామని.. కానీ ఒక్క గుడిసె కూడా కూలగొట్టలేదని స్పష్టం చేశారు.
మూసీ అని గరీబోళ్లను ఏడిపిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పొద్దున లేస్తే నిద్రపోకుండా, వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 వేల ఇళ్లు కూలగొడతామని అంటున్నారని.. అది ధర్మమేనా అని ప్రశ్నించారు. మూసీని మంచిగ చేయాల్సిందేనని.. కానీ ఇళ్లు కూలగొట్టుడు ఎందుకని నిలదీశారు. భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప అందులో ఏమీ లేదని అన్నారు. ఈజీగా చేయగలిగిన దాన్ని నాశనం పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏది చూసినా కూడా ఒకరకమైన దోపిడీ, ఒకరకమైన గుండాగిరి, అరాచకంతో ముందుకెళ్తున్నారే తప్ప.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టిండ్రని.. ఏం రోగమని కేసీఆర్ ప్రశ్నించారు.
