హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, మహోత్సవంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నరు.

ఇబ్రహీంపట్నం (మంగళపల్లి): హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మరియు ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి హాజరై అసోసియేషన్ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read-

అసోసియేషన్ ఆహ్వానించిన వారిలో ప్రముఖులు అమరవాది లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షుల సమక్షంలో కార్యక్రమం విజయవంతమైంది. అసోసియేషన్ అధ్యక్షులు లారి రవీందర్, ప్రధాన కార్యదర్శి రాముని రామనాథం, కోశాధికారి నరేష్ కుమార్ గోయల్ మరియు నూతన భవన నిర్మాణ కమిటీ చైర్మన్ పూరే లక్ష్మణ్, వైస్ చైర్మన్ మిట్టపల్లి అంజయ్య తదితరులు కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు రైస్ మిల్లుల యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X