హైదరాబాద్ : లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించిన మహేష్ కుమార్ గౌడ్, రక్తదానం మహాదానం అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ప్రాణదాతలుగా నిలిచే రక్తదాతలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Also Read-

రాహుల్ గాంధీ దేశ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడని ఆయన పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు నిదర్శనమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్ సెల్ ప్రతినిధులు, వైద్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు.
