డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసిన బండి సంజయ్

అంబేద్కర్ దేహాన్ని తరలించేందుకు పైసలడిగిన నీచ చరిత్ర కాంగ్రెస్ దే

అంబేద్కర్ చరిత్రను తగ్గించేందుకు అనేక కుట్రలు చేసింది

కుట్రలు చేసి అంబేద్కర్ ను రెండుసార్లు ఓడించింది

భారతరత్న ఇవ్వకుండా అవమానించిన చరిత్ర డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే

అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి

హైదరాబాద్ : అణగారిన వర్గాల్లో వెలుగులు నింపడంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఫరిఢవిల్లేలా రాజ్యాంగాన్ని రచించిన భారత అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన చమైన చరిత్ర కాంగ్రెస్ దేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబయికి తరలించిన కాంగ్రెస్ పార్టీ… ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీలు చెల్లించాలంటూ అంబేద్కర్ సతీమణికి బిల్లులు పంపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ దేనని విమర్శించారు.

అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చారు. అంబేద్కర్ చిత్రపటాలు, కాషాయ జెండాలతో కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. స్వయంగా బైక్ నడుపుతూ అంబేద్కర్ స్టేడియం, కోతిరాంపూర్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, గీతాభవన్, సర్క్యూట్ గెస్ట్ హౌజ్ మీదుగా కోర్టు చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం అక్కడ బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచి నీళ్లతో శుద్ధి చేశారు. జై భీమ్… జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…

దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను శుద్ది చేయడమే అంబేద్కర్ గొప్ప చరిత్రను భావితరాలకు తెలియజేయడమే. మనలోని అజ్ఝానాన్ని పారదోలి వెలుగులు నింపుకునేలా చేయడమే. ఆయన ఆశయాలను కొనసాగించడమే.

Also Read-

అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్. అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అణగారినవర్గాల ఆత్మగౌరవ పతాకం అంబేద్కర్. అతిపేద దళిత కుటుంబంలో పుట్టి తిండి కోసం అనేక తిప్పలు పడ్డ వ్యక్తి. ఎంత ఆకలి వేసినా ఒక్క పూటే భోజనం తింటూ చదువుకున్న మహనీయుడు.స్కూల్లో చదవనీయకుండా వెలివేసినా చదువును ఆపలేదు.. ఉన్నత చదువు కోసం 10 ఏళ్ల జీవితాన్నే బరోడా మహారాజు దగ్గర ఫణంగా పెట్టిన గొప్ప నాయకుడు.

శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపర్చిన వ్యక్తి అంబేద్కర్. దేశ విభజనను, జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు బీజేపీ తూ.చ తప్పకుండా క్రుషి చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే… భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేసింది. దళితుడైన రామ్ నాథ్ కోవింద్, ఆదివాసీ ముర్ముకు రాష్ట్రపతి పదవితో గౌరవించింది. 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించింది. NCBC (జాతీయ బీసీ కమిషన్) కు రాజ్యాంగ బద్ధత కల్పించింది. ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తోంది.

బీజేపీ క్రుషితోనే అంబేద్కర్ కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చింది. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల. పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే. 2023లో నారీ శక్తి వందన్ బిల్లు (33% రిజర్వేషన్లు) ప్రవేశపెట్టడం… ఆర్టికల్ 370 రద్దు చేయడం బీజేపీ ఘనతే.

కానీ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించింది. 1951లో హిందూకోడ్ బిల్లు, సామాజిక న్యాయ సాధికారత అంశాలపై అంబేద్కర్ అభిప్రాయాలను నెహ్రూ వ్యతిరేకిస్తే మనస్తాపానికి గురై న్యాయ శాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. ఆ తరువాత 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి, 1954 ఉప ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థిని నిలబెట్టి అంబేద్కర్ ను ఓడించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దే. అంతేగాకుండా అంబేద్కర్‌ను చరిత్రను తగ్గించే కుట్ర చేసింది. భారతరత్న ఇవ్వకుండా అవమానించింది. అంబేద్కర్‌ను ఓడించినోళ్లకు పద్మభూషణ్ ఇచ్చింది. ఆఖరికి అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబయికి తరలిస్తే…విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా అంబేద్కర్ భార్యకు రశీదు పంపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ దే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar