తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని పేర్కొన్నారు. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించే పవిత్ర సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.

Also Read-

ధర్మం, సత్యం, సేవాభావం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ఈ పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం, ఐక్యత మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X