AKF 24వ జూనియర్ & U21 ఛాంపియన్‌షిప్–2026: సత్యతేజకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సన్మానం

హైదరాబాద్:అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన సత్యతేజను హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా సన్మానించి అభినందించారు.

జోర్డాన్‌లోని అమ్మాన్‌లో నిర్వహించిన AKF 24వ జూనియర్ & U21 ఛాంపియన్‌షిప్–2026లో తెలంగాణకు చెందిన కరాటే క్రీడాకారిణి బ్రహ్మదండి సత్యతేజ అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని సాధించారు. 66 కేజీల విభాగం వ్యక్తిగత కుమిటే (Individual Kumite)లో సత్యతేజ ఈ పతకాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. తెలంగాణలో క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read-

“తెలంగాణలో కరాటే క్రీడ వేగంగా దూసుకెళ్తుందనడానికి సత్యతేజ సాధించిన అంతర్జాతీయ పతకమే నిదర్శనం” అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సత్యతేజ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి పతకం సాధించడం ద్వారా సత్యతేజ ప్రత్యేక గుర్తింపు పొందారు. AKF 24వ జూనియర్ & U21 ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ నుంచి పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా సత్యతేజ రికార్డు సృష్టించారు.

సత్యతేజ సాధించిన విజయంపై ఇండియా కోచ్ కీర్తన్ కొండూరు, స్టేట్ జనరల్ సెక్రటరీ రామస్వామి తదితరులు అభినందనలు తెలిపారు.

సత్యతేజ సాధించిన ఈ విజయం తెలంగాణ కరాటే క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు, అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర మహిళా క్రీడాకారిణుల ప్రతిభకు మరోసారి గుర్తింపు తీసుకొచ్చిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar