హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ లో ఈ రోజు “SIR 2025–26: ఇది భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేస్తుందా?” అనే అంశంపై భారతరత్న శ్రీ పి.వి. నరసింహారావు స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయలోని డా.సి.నారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహిస్తునున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read-
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఆర్థికవేత్త ప్రజా మేధావి డా. పరకాల ప్రభాకర్ హాజరై, “SIR 2025–26: ఇది భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేస్తుందా?” అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించనున్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, సాధారణ ప్రజానీకం ఎవరైనా హాజరు కావొచ్చని పేర్కొన్నారు.
