సీఎల్పీ నేత పీ జ‌నార్ధ‌న రెడ్డిపై గెలుపొందిన మాజీ మంత్రి విజ‌య‌రామారావు క‌న్నుమూత‌

हैदराबाद: सीबीआई के पूर्व निदेशक और पूर्व मंत्री के विजयराम राव का मंगलवार शाम निधन हो गया। विजयराम राव का जन्म वारंगल जिले के एटुरु नगर में हुआ था। उन्होंने अपनी हाई स्कूल की शिक्षा नेल्लोर जिले के वेंकटगिरी में की थी।

హైదరాబాద్ : మాజీ సీబీఐ డైరెక్ట‌ర్‌, మాజీ మంత్రి కే విజ‌య‌రామారావు మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. వ‌రంగ‌ల్ జిల్లా ఏటూరు నాగారంలో జ‌న్మించిన విజ‌య‌రామారావు.. ఉన్న‌త పాఠ‌శాల విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరిలో జ‌రిగింది.

అటుపై ఉన్న‌త విద్యా కోర్సుల కోసం మ‌ద్రాస్‌కు వెళ్లి మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీలో బీఏ ఆన‌ర్స్ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి కాగానే 1958లో క‌రీంన‌గ‌ర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా చేరారు. 1959 అక్టోబ‌ర్‌లో ఐపీఎస్ ట్రైనీగా శిక్షణ పూర్తి చేసుకుని చిత్తూరు ఏఎస్పీగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ఫూర్తితో 1999 ఎన్నిక‌ల నాటికి టీడీపీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో అప్ప‌టి సీఎల్పీ నేత పీ జ‌నార్ధ‌న రెడ్డిపై ఖైర‌తాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. అలా ఎమ్మెల్యేగా గెలుపొందిన మొద‌టిసారే రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. కానీ, 2004 ఎన్నిక‌ల్లో పీ జ‌నార్ధ‌న రెడ్డి, 2009 ఎన్నిక‌ల్లో దానం నాగేంద‌ర్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. 2014లో తెలంగాణ ఆవిర్భ‌వించిన త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. (ఏజెన్సీలు)

రేవంత్ రెడ్డి సంతాపం

మాజీ మంత్రి, సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అటు సిబిఐ డైరెక్టర్ గా, రాజకీయ నాయకులుగా మంత్రిగా విజయరామారావు సమాజానికి ఎనలేని సేవలు చేసారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మాజీ మంత్రి విజయ రామారావు మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం

మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ విజయ రామారావు మృతి చెందడం వల్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన విజయ రామారావు తొలి తరం ఐ పీ ఎస్ అధికారి అని, నిబద్ధత కలిగిన వ్యక్తి అని వినోద్ కుమార్ అన్నారు.

ఉద్యోగ పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లో చేరి మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో సేవలు అందించారని వినోద్ కుమార్ తెలిపారు. విజయ రామారావు కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X