రెండు లక్షల రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా CM దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్ : ఈ రోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా దేవరకొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా దేవరకొండ నియోజకవర్గం కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో మహా ధర్నా నిర్వహించి రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టగానే రుణమాఫీ చేయకుండా రైతులకు మొండి చేయి చూపించింది.

ఇది కూడ చదవండి-

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అనేక మెలికలు పెడుతూ రుణమాఫీ జాప్యం చేయకుండా వెంటనే బేషరతుగా ఏకకాల రెండు లక్షల రైతులను మాఫీ చేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకం చేసి మరో మహా రైతు ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X