हैदराबाद: तेलंगाना में विधानसभा चुनाव की सरगर्मी तीन महीने में शुरू हो जाएगी. विधानसभा का कार्यकाल अगले साल 16 जनवरी को खत्म हो रहा है। ऐसे में केंद्रीय चुनाव आयोग उन राज्यों में चुनाव प्रक्रिया शुरू करने के लिए अधिसूचना जारी करने को तैयार है जहां चुनाव की समय सीमा नजदीक आ रही है।
कुल मिलाकर ऐसा लग रहा है कि इस बात की पूरी संभावना है कि इस साल 10 अक्टूबर को तेलंगाना विधानसभा चुनाव की अधिसूचना जारी हो जाएगी। करीब एक हफ्ते पहले केंद्रीय चुनाव अधिकारियों ने राज्य का दौरा किया था और सीएस, डीजीपी और कलेक्टरों से मुलाकात की व कई सुझाव और सलाह दी।
तेलंगाना में एक साल के भीतर चुनाव होने हैं। इसलिए राजनीतिक दल पहले से ही अपनी रणनीतियों को अपने-अपने अंदाज में धार दे रहे हैं। इसी के अनुरूप केंद्रीय चुनाव आयोग भी चुनाव प्रक्रिया पर काम कर रहा है। ऐसा लग रहा है कि तेलंगाना में विधानसभा चुनाव की अधिसूचना जल्द ही जारी हो जाएगी।
तेलंगाना विधानसभा का कार्यकाल 16 जनवरी, 2024 को समाप्त हो रहा है। ऐसी खबर है कि चुनाव अधिसूचना अक्टूबर के पहले या दूसरे सप्ताह में जारी होने की उम्मीद है। सब कुछ ठीक रहा तो लगता है कि 10 अक्टूबर को ही नोटिफिकेशन आ जाएगा। 2018 में 10 नवंबर को अधिसूचना जारी की गई थी। तब विधानमंडल भंग हुआ और चुनाव हुए। इसी तरह इस बार भी सीईसी एक महीने पहले अधिसूचना जारी करने पर विचार कर रहा है।
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్, ఎన్నికల సంఘం కసరత్తు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మరో మూడు నెలల్లో మొదలు కానుంది. వచ్చే ఏడాది జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈనేపధ్యంలో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని..నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది.
మొత్తం మీద ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించి సీఎస్), డీజీపీ, కలెక్టర్లతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఏడాదిలోపే ఎన్నికలు ఉంటాయని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమదైన స్టైల్లో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రణాళికను రూపొందించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది.
2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం. అన్నీ కుదిరితే అక్టోబర్ 10వ తేదినే నోటిఫికేషన్ వెలువడవచ్చని తెలుస్తోంది. 2018లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా నవంబర్ 10న నోటిఫికేషన్ వెల్లడించింది. అదే విధంగా ఈసారి నెల రోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తోంది సీఈసీ. (ఏజెన్సీలు)