హైదరాబాద్ : సేంద్రీయ వ్యర్థాల నుండి వ్యవసాయం కోసం వాయువును ఉత్పత్తి చేయాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, డైరెక్టర్ శాస్త్రవేత డా.ఎ. గంగాగ్ని రావు పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని “సుస్థిర అభివృద్ధి కోసం వ్యర్థాల నిర్వహణ, వాతావరణ మార్పు, ఇంధన భద్రతల మధ్య పరస్పర సంబంధం” అనే అంశంపై గురువారం ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, డైరెక్టర్ శాస్త్రవేత డా.ఎ. గంగాగ్ని రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పర్యావరణ సమస్యలు, సవాళ్లు, సుస్థిర అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక నమూనాల గురించి వివరించారు. వాతావరణ మార్పు, ఇంధన డిమాండ్, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచ సవాళ్లును ఎదురుకుంటుందన్నారు. సేంద్రీయ భాగం మున్సిపల్ ఘన వ్యర్థాలుతో సహా సేంద్రీయ వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్‌కు మళ్లించినప్పుడు, అది వాతావరణ మార్పుకు దోహదపడే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలకు దారితీస్తుంది. జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాలను సాధ్యమైనంత వరకు ప్రాంగణంలోనే కంపోస్టింగ్ లేదా బయోమిథేనేషన్ ద్వారా ప్రాసెస్ చేసి, శుద్ధి చేసి పారవేయాలి.
Also Read-
హోటళ్లు, రెస్టారెంట్లు జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాలను వేరు చేయాలి, అటువంటి ఆహార వ్యర్థాలను కంపోస్టింగ్ / బయోమిథేనేషన్ కోసం ఉపయోగించాలి అని ఆయన సూచించారు. వాయురహిత జీర్ణక్రియ ప్రక్రియ (Anaerobic Digestion Process) విధానం, డైజెస్టర్ల వర్గం అనేది AD ప్రక్రియను ఉత్పత్తి అని, దీనిని సేంద్రీయ ఎరువుగా ఉపయోగించవచ్చని, ఇది కృత్రిమ ఎరువుల వాడకాన్ని నివారిస్తుందన్నారు. తద్వారా ఖర్చులు, సంబంధిత ఉద్గారాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇంధన భద్రత, సుస్థిర వ్యవసాయం కోసం వాయురహిత గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ (AGR) ద్వారా సేంద్రీయ వ్యర్థాల నుండి సంపదను సృష్టించాలని ఆయన సూచించారు. దీనిని భూమిపై చల్లడం వల్ల నేల నాణ్యతను మెరుగుపరచవచ్చు, పురుగుమందుల వాడకాన్ని మరియు నీటి డిమాండ్‌ను తగ్గించవచ్చు, దీనివల్ల రైతులకు మద్దతు లభిస్తుందన్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో రోజుకు 10 టన్నుల సామర్థ్యం గల బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని వివరించారు.

కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఇంచార్జ్ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.ఇ. సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రొ. సుధా మాట్లాడుతూ పర్యావరణ హితం, ఆర్ధిక మనుగడ, సమాజానికి అందుబాటులో ఉండేలా సుస్థిర అభివృద్ధి అవసరమన్నారు. ప్లాస్టిక్ దుర్వినియోగంతో పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతోందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌కు పునర్వినియోగ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లకు దూరంగా ఉండాలి, రీసైక్లింగ్ వంటి వాటిపై వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, ఉత్పత్తిని తగ్గించే ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించారు. పచ్చదనంతోనే పర్యావరణ కాలుష్య నివారణ సాధ్యమని చెప్పారు.
కార్యక్రమానికి సైన్స్ విభాగ డీన్ ప్రొ. కె. ప్రమీలా అధ్యక్షత వహించి మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మాజీ అధ్యాపకులు ప్రొ. యస్. వి. రాజశేఖర రెడ్డి, డైరెక్టర్లు, డీన్లు, శాఖల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, సంఘాల ప్రతినిధులు, పరిశోదకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
