“మాకు మా ఉద్యోగుల ఆరోగ్యమే ముఖ్యం”

హైదరాబాద్ : కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువ మంది ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడిందని, ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ లో కూడా చాలా మందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయని వీటిని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కిమ్స్ సన్‌ షైన్ హాస్పిటల్స్ సహకారంతో విశ్వవిద్యాలయ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యుల కోసం బుధవారం యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వైద్య పరీక్షలు చేయిoచుకున్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేకంగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశామని, విశ్వవిద్యాలయ సిబ్బందికి, వారి కుటుంభ సభ్యులకు ఆరోగ్య సేవలను అందించేందుకు సహకరించిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కిమ్స్ సన్‌షైన్ గ్రూప్ హాస్పిటల్స్‌కు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Also Read-

ఈ ఆరోగ్య శిబిరంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా ఎల్. విజయ కృష్ణా రెడ్డి; అన్ని విభాగాల డైరెక్టర్లు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు ఆరోగ్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ మేనేజర్ ఎం. శ్రీనివాస్; కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్; గైనకాలజిస్ట్ డా. అశ్విని దేవరశెట్టి, అసిస్టెంట్ మేనేజర్, శ్రీమతి సరోజిని; ఎఫ్‌హెచ్‌పీఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ యు. ప్రభాకర్; కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వైద్యులు తదితరులు వైద్య శిబిరంలో పాల్గొన్న ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X