కార్యకర్తలు, ప్రజల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకొని పరిష్కరించేందుకే ముఖాముఖి కార్యక్రమం
గత ప్రభుత్వాలది గడీల పాలన.. మాది ప్రజల మధ్య పాలన
అదాని, అంబానీలను కిందకు తెచ్చి మహిళా సంఘాలతో వెయ్యి మెగావాట్ల ఒప్పందం
కులగనన చారిత్రాత్మక నిర్ణయం అడ్డుకునేందుకు దోపిడీదారులు తప్పుడు ప్రచారం
గాంధీభవన్లో ముఖాముఖి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ : మాది ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి గాంధీభవన్లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గాంధీ భవన్లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజల ఆలోచనలు, పార్టీ కార్యకర్తల ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వంలో మంత్రులు, డిప్యూటీ సీఎం గా నేను గాంధీభవన్ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం గడీల మధ్యన పాలించగా నేడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యావత్ క్యాబినెట్ ప్రజల మధ్య పాలన చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి నిలిపిందని తెలిపారు.
ప్రపంచ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని యావత్ క్యాబినెట్ ఆలోచన చేసి హాస్టల్ విద్యార్థుల చార్జీలను 40% పెంచాలని వివరించారు. గత పాలకులు 10ఏ ళ్లపాటు ఈ అంశాన్ని పక్కన పడేశారు అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇవన్నీ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం విజయాలు అన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పాము ఏడాదిలోపే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. గత పది సంవత్సరాల పాటు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారని, మేము అధికారంలోకి రాగానే పేపర్ లీకేజీలు, ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించామని అన్నారు.
Also Read-
జనాభాలో సగభాగం ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 25 నుంచి 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు … ఐదు సంవత్సరాల కాలంలో మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఒప్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. పరిశ్రమలు, ఉత్పత్తి అంటే అదాని, అంబానీ మాత్రమే అనుకునేవారు కానీ మేము వారిని కిందికి దించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వివరించారు. ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి వాటిని మహిళా సంఘాలకు అప్పగించి.. వారు ఆర్టీసీకి బస్సులు లీజుకు ఇచ్చి ఆదాయం పొందేలా చూస్తామని అన్నారు.
ప్రపంచస్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, మూలనపడ్డ 65 ఐటిఐ లను అడ్వాన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. కుల గణన చారిత్రాత్మక నిర్ణయం.. దీనిని అడ్డుకోవాలని దోపిడీదారులు సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సర్వే పూర్తయితే ఇన్నాళ్లు దోచుకున్న వారి ఆటలు సాగవని అన్నారు. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తెచ్చి సమ సమాజ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం పునాదులు వేస్తుంది అన్నారు.
This is People’s govt, these are people’s victories
‘Face to Face ‘ programme to know about problems of party workers, people
Previous govt extended ‘Gadi’ rule, we rule amidst people
Caste census a historic decision, looters indulging in false propaganda to disrupt it
Adani, Ambani brought down the peg to make 1000 MW agreement with women SHGs
Says Deputy CM Bhatti Vikramarka Mallu in Face to Face programme at Gandhi Bhavan
HYDERABAD: Ours is People’s government that interacts and works along with people to find solution to their problems and hence this government organised Face to Face programme with people and party workers at Gandhi Bhavan, said Deputy Chief Minister Bhatti Vikramarka Mallu .
Speaking to media persons at Gandhi Bhavan here on Thursday, Mr.Bhatti said that he as Deputy CM and Ministers were participating in the Face to Face programme to understand the thoughts and opinions of people who voted for Congress Party keeping faith in Congress Party’s ideology and address their issues.
While the previous government extended its rule from their palatial houses (Gadis) away from the people, this government including the Chief Minister, Deputy CM and entire Cabinet is ruling from midst of people, he said.
The Deputy CM said that the government kept its focus on education and health in the State . It is starting Young India Integrated Residential Schools to provide world class quality education to poor students. The Cabinet resolved that today’s children are tomorrow’s future and increased hostel charges of students by 40 per cent while the previous BRS government kept this issue aside for 10 years
The free supply of power upto 200 units, free RTC bus travel to women , supply of gas cylinder at Rs.500 each, construction of Indiramma houses at Rs.5 lakh each are some of the victories of people’s government elected by people, he said.
The Congress government promised to issue notification for recruitment if elected to power and as promised filled 50,000 posts within one year. The previous government could not conduct Group I exam for 10 long years . The Congress government without delay conducted the Group I exam successfully without any paper leakages, Mr Bhatti said.
Keeping women who comprise 50 per cent of population in mind, the People’s government is striving to extend Rs 20,000 crore to Rs.25,000 crore interest free loans per year to women and Rs 1 lakh crore interest free loans to women in five years to develop them as entrepreneurs.
Earlier one only thought of Adani and Ambani when one talked about industries and production. But we brought them down the peg and gave priority to members of Self Help Groups and the State government made agreement with them for generation of 1000 MW solar power. The government would purchase RTC buses and give them to women groups so that they could lease them to RTC , Mr.Bhatti said.
The Congress government is setting up world class Sports University and transforming the 65 neglected ITI s into Advanced Centres .
Stating that caste census is a historic decision, Mr.Bhatti said that the looters with an ulterior motive were indulging in false propaganda against the survey. Once the survey is completed, it will put a stop to exploitation of those who looted people till now. The People’s government will lay foundation to bring the society out of feudal setup and take it towards an equal society, Mr Bhatti asserted.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖాముఖి కార్యక్రమానికి వినతుల వెల్లువ
సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు
గాంధీభవన్లో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి వినతులు వెలువత్తాయి. సుమారు 300 మంది వివిధ సమస్యలను డిప్యూటీ సీఎంకు వివరించారు. మొదట బృందాలుగా వచ్చిన వారితో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించిన ఇంకా పోస్టింగులు ఇవ్వలేదంటూ జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు డిప్యూటీ సీఎం కలిశారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం వారికి హామీ ఇచ్చారు. ట్రాన్స్కో, జెన్కోలో ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్ల, ఇంజనీర్ల ఖాళీలను భర్తీ చేయాలని సంబంధిత శాఖ ఉద్యోగులు కోరారు. ఇలా పలు సమస్యలపై ఐదు బృందాలు డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేయగా సమ్మతి అధికారులను వివరణ కోరుతూ లికిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు.
తదుపరి సాధారణ పౌరులు, కార్యకర్తల సమస్యలు విని సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు తమ విజ్ఞప్తులు సమర్పించారు.
తన తల్లి మాడుగు కళ్యాణి (42) బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుందని, క్యాన్సర్ ఫోర్త్ స్టేజిలో ఉంది హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కుమారుడు మహేష్ విజ్ఞప్తి చేశారు. వెను వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం ఆసుపత్రి బిల్లులు తీసుకువచ్చి.. ఆ మొత్తానికి ఎల్ఓసి తన వద్ద తీసుకోవాల్సిందిగా తెలిపారు.
ఎల్ఓసి మంజూరు బాధ్యతలను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిందిగా తన పీఏలకు ఆదేశించి క్యాన్సర్ రోగి కుమారుడు మహేష్ కు తన సెల్ నెంబరు ఇచ్చి ఇబ్బంది ఉంటే ఫోన్ చేయాల్సిందిగా తెలిపారు. జూ పార్కులో డైట్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయని సిబ్బంది కోరగా … వెంటనే మంజూరు చేయాలంటూ అధిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తన లాండ్రీ షాపుకు 20వేల కరెంటు బిల్లు వచ్చినట్టు ఓ వినియోగదారుడు సమస్యను దృష్టికి తీసుకురాగా పరిష్కరించాల్సిందిగా సమాధి అధికారులను సెల్ఫోన్లో ఆదేశించారు.
వినతుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యాలయానికి సంబంధించి 28 దరఖాస్తులు రాగా, సీఎం ఓ కార్యాలయం కి సంబంధించి 199, రెవిన్యూ శాఖకు సంబంధించి 41, సివిల్ సప్లై శాఖ 9, రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ కి సంబంధించి 4, పర్యాటక శాఖకు సంబంధించి 2, దేవాలయ, అటవీశాఖ కు సంబంధించిన 8, పిసిసి కార్యాలయం సంబంధించి 19, జిహెచ్ఎంసి 6, వ్యవసాయ శాఖ కు సంబంధించిన 8 దరఖాస్తులు వచ్చాయి