హైదరాబాద్ లో 21 నుండి 24 వరకు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాలు, ప్రత్యేక ఆకర్షణ…

హైదరాబాద్ : ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నవంబర్ 21 తేది నుండి 24 తేది వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారని చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.

ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొననున్నట్లు చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.

ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నందు మత్స్యకారులు వివిధ రకాల ఫిష్ వంటకాలు చేసి ప్రదర్శిస్తారని, ప్రతిభ కనబర్చిన మత్స్యకారులు ప్రముఖల చేత అవార్డులు అందుకుంటారని తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో నవంబర్ 21వ తేది నుండి నవంబర్ 24 వ తేది వరకు నాలుగు రోజుల పాటు ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుందని అన్నారు.

ఇది కూడ చదవండి-

ఈ నెల 21వ తేది నుండి 24వ తేది వరకు హైదరాబాద్ లోని డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహం గ్రౌండ్ దగ్గర, ఐమాక్స్ థియేటర్ పక్కన జరగబోయే ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఉత్సవాలకు రాష్ట్రంలోనున్న నలుమూలల నుండి మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X