Dr B R Ambedkar Open University భూ కేటాయింపు వ్యవహారం, తీవ్ర ఉద్యమంగా మారుతున్న నిరసనలు

ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను ఉపసంహరించుకోవాలి
63వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను వ్యతిరేకిస్తు ఉద్యోగులు గురువారం కూడా నిరసనను కొనసాగించారు. ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, ఉద్యోగులు గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న (బుధవారం) విశ్వవిద్యాలయంలో వంటా వార్పూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Also Read-

నిరసన కార్యక్రమంలో డా. ప్రమీల కేతవత్; డా. రజని; డా. యకేశ్ దైద; డా. ఉదయిని; కాంతం ప్రేమ్ కుమార్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర; పాండు; షబ్బీర్; రాములు అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X