हैदराबाद: तेलंगाना सरकार ने मंगलवार को विशेष विधानसभा बैठक में लोक आयोग द्वारा दी गई जाति जनगणना सर्वेक्षण रिपोर्ट पेश की। शाम को सभा ने सदस्यों के साथ चर्चा के बाद रिपोर्ट को मंजूरी दे दी। ज्ञात है कि विधानसभा ने देशव्यापी जाति जनगणना की मांग को भी मंजूरी दी है।
हालांकि, कांग्रेस एमएलसी तीनमार मल्लन्ना (चिंतापंडु नवीन) ने बीसी समूहों से जाति जनगणना रिपोर्ट का विरोध करने का सनसनीखेज आह्वान किया था, जिसमें आरोप लगाया गया था कि विधानसभा में पेश की गई रिपोर्ट धोखाधड़ी थी। एमएलसी मल्लन्ना ने पिछड़ा वर्ग जनगणना रिपोर्ट के दस्तावेजों को जलाते हुए आरोप लगाया कि विधानसभा में पेश की गई जाति जनगणना रिपोर्ट तथ्यों से अलग है और इस सर्वेक्षण रिपोर्ट में 40 लाख पिछड़ा वर्ग के लोगों को कम कर दिया गया है।
इस अवसर पर मल्लन्ना ने सनसनीखेज आरोप लगाया कि बीसी को कमजोर करने की साजिश की जा रही है और यह रिपोर्ट बीसी के भविष्य को ख़त्म कर देगी। साथ ही, एमएलसी टीनमार मल्लन्ना ने कहा कि वह इस रिपोर्ट का विरोध कर रहे हैं। इस रिपोर्ट में वोटों की गिनती में सभी गलतियाँ हैं। यह पूरी तरह से धोखाधड़ी है और उनका सभी के साथ न्याय करने का कोई इरादा नहीं है। बीसी लोगों के अपमान के विरोध में वह इस रिपोर्ट जला रहे हैं।
इस बीच मल्लन्ना बीसी ने कल जाति जनगणना रिपोर्ट के बारे में जो बात कही थी वही बात पूर्व मंत्री केटीआर ने आज विधानसभा की बैठक में उनके टिप्पणियों को याद किया। केटीआर याद दिलाना कि कांग्रेस एमएलसी कह रहे है कि कांग्रेस सरकार द्वारा कराया गया जाति जनगणना सर्वेक्षण गलतियों का मिश्रण है। यह टिप्पणी विधानसभा में बहस का कारण बना है।
तेलंगाना विधानसभा ने सर्वसम्मति से प्रस्ताव पारित किया
गौरतलब है कि तेलंगाना विधानसभा ने सर्वसम्मति से एक प्रस्ताव पारित किया, जिसमें केंद्र से राज्य सरकार द्वारा कराए गए घरेलू जाति और सामाजिक आर्थिक सर्वेक्षण का अनुकरण करने का आग्रह किया गया। मुख्यमंत्री रेवंत रेड्डी ने प्रस्ताव पेश करते हुए आश्वासन दिया कि राज्य सरकार पिछड़े वर्गों, अनुसूचित जातियों और जनजातियों तथा अन्य हाशिए पर पड़े वर्गों के विकास के लिए प्रतिबद्ध है।
इससे पहले सर्वेक्षण के मुख्य बिंदुओं पर मुख्यमंत्री द्वारा दिए गए बयान पर बहस के दौरान रेवंत रेड्डी ने सदन को सूचित किया कि कांग्रेस पार्टी विपक्ष के नेता राहुल गांधी के माध्यम से संसद में इस मुद्दे को उठाकर केंद्र पर देश भर में सर्वेक्षण कराने का दबाव बनाएगी। रेड्डी ने कहा कि राहुल गांधी और कांग्रेस पार्टी द्वारा दिए गए आश्वासन के अनुसार तेलंगाना में सर्वेक्षण कराया गया है।
यह देखते हुए कि पिछड़े वर्गों को कानून के अनुसार 42 प्रतिशत आरक्षण प्रदान करने के लिए एक संवैधानिक संशोधन की आवश्यकता है। रेड्डी ने कहा कि कांग्रेस राज्य में आगामी स्थानीय निकाय चुनावों में पिछड़े वर्गों के लिए 42 प्रतिशत कोटा प्रदान करेगी।
బీసీ కులగణన నివేదిక పత్రాలను తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో పబ్లిక్ కమిషన్ ఇచ్చిన కులగణన సర్వే నివేదికను ప్రవేశ పెట్టింది. దీనిపై సభ్యులతో చర్చించి సాయంత్రం ఈ నివేదికకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ కు అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే చట్ట సభలో ప్రవేశపెట్టిన నివేదిక దొంగ లెక్కలు అని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) కులగణన నివేదిక ను బీసీ సంఘాలు వ్యతిరేకించాలని సంచలన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక వాస్తవాలకు భిన్నంగా ఉందని ఈ సర్వే నివేదికలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపిస్తూ బీసీ కులగణ న నివేదిక పత్రాలను ఎమ్మెల్సీ మల్లన్న లైవ్ లోనే తగలబెట్టాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను అణగదొక్కడానికి కుట్ర చేస్తున్నారని, అలాగే బీసీల భవిష్యత్తు (బీసీల భవిష్యత్తు)ను సమాధి చేసే నివేదిక అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఓట్ల లెక్కలతో పోల్చితే ఈ నివేదికలో అన్ని తప్పులే ఉన్నాయని ఇది పూర్తిగా దొంగ లెక్కలు అన్ని బీసీ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన వీరికి లేదని ఈ నివేదికపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని బీసీల లేక్కలను తక్కువ చేసి చూపించినందుకు నిరసనగా నివేదికను తాను తగలబెడుతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్నబీసీ కులగణన నివేదిక పై నిన్న మాట్లాడగా అవే వ్యాఖ్యలను ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశంలో గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని కాంగ్రెస్ ఎమ్మెల్సీనే చెబుతున్నాడని కేటీఆర్ గుర్తు చేయడం అసెంబ్లీలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ చేపట్టిన కులగణన సర్వే ను ఈ రోజు కేబినెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా కులగణన నివేదికను ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కేబినెట్ ఆమోదం తెలిసిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ నివేదికపై సభ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయగా మంత్రులు సహా, సీఎం వారి అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ సమావేశంలో చివర్లో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి ఆమోదం తెలపాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీ ఆమోదం తెలిపిన కులగణన వివరాలు ఇకపై అధికారిక లెక్కలుగా రూపొందనున్నాయి. ఈ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ నివేదికను సైతం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎన్నో సంవత్సరాలుగు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే ఈ నిర్ణయాన్ని తాను సభలో పరిచయం చేయడం తన జీవితంలో గుర్తుండి పోతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజే నేను సభలో ప్రకటన చేశనని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అంతకు ముందు తెలంగాణ శాసన మండలి కూడా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. మొత్తం మూడు వర్గాలుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్ ఇచ్చిన నివేదికకు శాసన మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.(ఏజెన్సీలు)