హైదరాబాద్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న డిప్రెషన్‌కు యోగా ఒక అద్భుతమైన విరుగుడని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో “ప్రపంచ యోగా దినోత్సవానికి పుష్కర వైభవం” పేరుతో యోగా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేసిన అనంతరం రాంచందర్ రావు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల క్రితం యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని, ఆయన చొరవతోనే నేడు జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని కొనియాడారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి ప్రజలు పెద్దఎత్తున యోగా సాధన చేయడం చూశానని, ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశేష ఆదరణ లభిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

శారీరక, మానసిక ఆరోగ్యానికే కాకుండా, సామాజిక సంతులనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి యోగా ఎంతో అవసరమని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతున్నారని, దానికి అద్భుతమైన యాంటీ డిప్రెషన్‌గా యోగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థులంతా తప్పనిసరిగా యోగా సాధన చేయాలని, తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఖేలో భారత్ వంటి అనేక కార్యక్రమాలతో పాటు ప్రతి ఏటా స్వయంగా యోగా వేడుకల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో రేపు ఇందిరా పార్కులో నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కూడా ప్రజలు, యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read-

హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఫరేడ్ గ్రౌండ్లో 1డే కౌంట్ డౌన్ ఈవేంట్ లో భాగంగా యోగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శూక్ల గారు , భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

కేంద్ర బొగ్గు గనుల, శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ లతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ యోగా మహోత్సవానికి నగర నలుమూలల నుండి యువతీ యువకులు, విద్యార్థులు, మహిళలు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేదిక ప్రాంగణమంతా యోగా సాధకులతో కిక్కిరిసిపోయింది.
యోగా ఒక మతానికి పరిమితం కాదు, అది ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప వరం : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ : రేపు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనున్న నేపథ్యంలో, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా మహోత్సవంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యోగా విశిష్టతను, నేటి సమాజానికి దాని ఆవశ్యకతను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి.

“యోగాను ఏదో ఒక మతానికి పరిమితం చేసి చూడటం ముూర్ఖత్వమే అవుతుంది. యోగా అనేది ఒక నిర్దిష్ట మతానికి సంబంధించింది కాదు అది సర్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి దోహదపడే అద్భుత సాధనం. మన పూర్వీకులు ఎంతో పరిశోధించి, రంగరించి మానవాళికి అందించిన ఒక పరిపూర్ణ జీవన విధానం ఇది.
“భారతదేశం విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణం. ప్రపంచానికి మనదేశం అందించిన అత్యంత గొప్ప, అపురూపమైన కానుక ‘యోగా’. నేడు ప్రపంచం మొత్తం పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి అటు ఇటు కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక్కటే శరణ్యం.
“యోగా అనేది కేవలం కొన్ని శారీరక ఆసనాలు మాత్రమే కాదు.. అది మనిషిని సమగ్రమైన, సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మానవ చైతన్యానికి నిదర్శనమైన యోగా ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది మనిషికి, ప్రకృతి మాతకు మధ్య అనుసంధానాన్ని పెంచే ఒక గొప్ప వరం.
“నేటి ఆధునిక కాలంలో మనుషులను పీడిస్తున్న మానసిక ఒత్తిడిని దూరం చేసి, గుండె నిండా స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే శక్తి యోగాకు ఉంది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే నానుడిని నిజం చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి ఒడిలో జీవించడం అలవాటు చేసుకోవాలి. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి.
[
యోగా అనేది ఒక దివ్య ఔషధం.. కులమతాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలి : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బృహత్తర కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగా సాధన ద్వారా మానసిక దృఢత్వానికి సామాజిక ఆవశ్యకతపై వివరించారు
“యోగా అనేది అందరినీ ఏకం చేసే ఒక అద్భుత సాధనం. ఇందులో ఎలాంటి సామాజిక భేదభావాలు, కులమతాల పట్టింపులు ఉండవు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇది సమాజంలో సమరసతను పెంపొందిస్తుంది.
