గోషామహల్ చకనవాడి దగ్గర కుంగిన నాలా, పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు, అడ్డుకున్నాపోలీసులు (Video)

హైదరాబాద్ : గోషామహల్ చకనవాడి దగ్గర కుంగిన నాలాను కాంగ్రెస్ పార్టీ GHMC ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ Daripally Raja Shekar Reddy, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సాయి మరుయు కార్యకర్తలు పరిశీలించారు.

ఈ సందర్భంగా దర్పల్లి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు,నగర్ మేయర్ Vijayalaxmi Gadwal, GHMC MAYOR సంఘటన స్థలానికి వెంటనే వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి ప్రజలకు న్యాయం చేయమని అడిగినందుకు మా పై పోలీస్ అధికారులను పంపి దౌర్జన్యం చెపియడం సిగ్గుసేతు అని విమర్శించారు. కేటీఆర్ ఇక్కడికి వచ్చి వెంటనే నష్ట పరిహారం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.

గోషామహల్ నియోజకవర్గం.లోని చాక్నవడి బస్తీ లో రోడ్డు కూలిపోవడం జరిగింద. బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తే.. పోలీస్ యంత్రాంగం ప్రభుత్వనికి అండగా ఉండి..కాంగ్రెస్ కార్పొరేటర్స్ విజయ రెడ్డి గారిని, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారిని, మెట్టు సాయికుమార్ గారిని అక్రమంగా అడ్డు కోవడం జరిగింది.

గోషామహల్లోని చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయింది. రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందులో పడిపోయాయి. ప్రతి శుక్రవారం బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేస్తారు. దీంతో కూరగాయలు ఇతర వస్తువులు కొనేందుకు చాలా మంది జనం అక్కడకు వచ్చారు. అదే సమయంలో నాలా కుంగడంతో కూరగాయల దుకాణాలతో పాటు జనం అందులో పడిపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

40 ఏండ్ల క్రితం నాలాపై రోడ్డు వేశారని, ట్రాన్స్ పోర్ట్, టింబర్ డిపోల నుంచి లారీలు ఓవర్ లోడ్ తో తిరుగుతుండటమే రోడ్డు కుంగిపోవడానికి కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మార్కెట్ జరిగే రోజు కావడంతో సాయంత్రం సమయంలో నాలా కుంగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రమాదానికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గోషామహల్లోని చాక్నవాడి నాలా నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాలాను ఆయన పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

2009లో నాలాపై స్లాబ్ వేశారని.. నాసిరకంగా నిర్మాణం చేపట్టారని అన్నారు. కుంగిన నాలాతో నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1980లో కూడా నాలా పడిపోయిందని.. అప్పుడు ఎవరు గాయపడలేదని చెప్పారు. తాజాగా జరిగిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X