“బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే”

ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం

అధికారంలోకి రావడం ఖాయం

బీజేపీకి అభ్యర్థులే లేరనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారమే

కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో పోలిస్తే సంస్థాగతంగా బలంగా ఉన్నాం

బూత్ స్వశక్తీరణ్ అభియాన్ వర్క్ షాప్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమ్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థాగత నిర్మాణం విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో పోలిస్తే బీజేపీయే బలంగా ఉందన్నారు.

ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్ ప్రారంభమైంది. బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహా ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలకు సంస్థాగతంగా బూత్ కమిటీల్లేవు. గ్రామ, మండల కమిటీల్లేవు. సంస్థాగతంగా బలంగా లేని పార్టీలు సుధీర్ఘ కాలం మనుగడ సాధించలేవు. బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్నందునే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. మధ్య ప్రదేశ్, గుజరాత్ లో సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్నందున ఓటు బ్యాంకు పెంచుకుంటూ అధికారంలోకి ఉన్నాం. దేశంలోనూ రెండు సార్లు విజయం సాధించాం. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నం.

• తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే సంస్థాగతంగా బలోపేతానికి క్రుషి చేస్తున్నాం. 34 వేల పోలింగ్ బూత్ కమిటీలుంటే అందులో 80 శాతం కమిటీలను పూర్తి చేశాం.

• అయిననప్పటికీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కావాలనే బీజేపీకి అభ్యర్థుల్లేరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 56 నియోజకవర్గాల్లో పర్యటిస్తే నాయకుల పోటీ పడ్డారు. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్నారు. ఉఫ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని తేల్చేశారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల, స్థానిక సంస్థల ఫలితాలే.

• స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లతో పార్టీకి మంచి వాతావరణం ఏర్పండి. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. టీఆర్ఎస్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలతోపాటు స్థానిక సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం కలుగుతోంది.

• వీటితోపాటు ఎన్నికల్లో గెలిచాక ఏ హామీలను అమలు చేస్తామో చెబుతున్నాం. అందులో భాగంగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందరికీ ఇండ్లు, రైతులకు ఫసల్ బీమాను అమలు చేస్తామని చెప్పాం. కేంద్రం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నాం.

• టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో.. అభివ్రుద్ధి ఎందుకు చేయడం లేదో చెప్పడం లేదు.. వాటిపై సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికే ప్రధానమంత్రి మోదీపైన, బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కేంద్రం తెలంగాణకు పైసలు ఇవ్వడం లేదని అబద్దాలు చెబుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు పలుమార్లు సిద్ధమని సవాల్ విసిరినా ఆ పార్టీ నేతలు తోకముడిచారు.

• సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే సంస్థాగతంగా పూర్తి స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నందునే అనేక కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.

• తెలంగాణలో అత్యధిక పెళ్లిళ్లున్న రోజు నేడు. అయినా అన్నింటినీ పక్కనపెట్టి ఈ వర్క్ షాప్ కు అందరూ హాజరు కావడం పార్టీపట్ల ఉన్న కమిట్ మెంట్ నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X