“ట్విట్టర్ టిల్లు ఖబడ్దార్, ప్రధానిని బ్రోకర్ అంటావా?”

-మళ్లీ దొంగల చేతికే తాళాలిస్తారా?

-టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకుండానే పరీక్షలు నిర్వహిస్తారా?

-కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాల్సిందే

-సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే

-నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే

-ట్విట్టర్ టిల్లు ఖబడ్దార్…. ప్రధానిని బ్రోకర్ అంటావా?

-మీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్

-అభివ్రుద్ధిపై చర్చించకుండా బీజేపీని తిడుతూ టైం పాస్ రాజకీయాలు చేస్తారా?

-లిక్కర్, డ్రగ్స్ సహా ఏ దందాను వదిలిపెట్టని కుటుంబం మీది

-పరువు లేనోడు నాపై పరువు నష్టం దావా వేసిండు

-బీఆర్ఎస్ ను తెలంగాణ నుండి తరిమికొట్టేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు

-సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

-ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అంటూ అభివర్ణణ

-కార్యకర్తల త్యాగాలు, సిద్ధాంతాల పునాదులపై ఏర్పడ్డ పార్టీ బీజేపీ అంటూ అభివర్ణణ

హైదరాబాద్ : ‘‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది జీవితాలు నాశనం (బర్బాద్) అయ్యాయి. ఇంతమంది నష్టపోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా మళ్లీ వాళ్ల ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ నోరెందుకు విప్పడం లేదని ప్రశ్నించారు.

• సంగారెడ్డి జిల్లాలో కొద్ది సేపటి క్రితం బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కందిలోని నూతన పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.

• ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు, తెలంగాణ సహ ఇంఛార్జ్ అరవింద్ మీనన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికా ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఇంఛార్జీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, దేశ్ పాండే సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• వర్చువల్ ద్వారా జిల్లా పార్టీ నూతన కార్యాలయాలను ప్రారంభిస్తున్న జేపీ నడ్డా గారికి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ అత్యవసర కార్యక్రమం ఉన్నందున రాలేకపోయారు. త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని జేపీ నడ్డా మాట ఇచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పారు.

• ఈరోజు నడ్డా చేతుల మీదుగా తెలంగాణలో సంగారెడ్డితోపాటు 5 జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం సందర్భంగా అంబరాన్ని అంటేలా పండుగ వాతావరణంలో సంబురాలు చేసుకుంటున్నారు.

• కార్యాలయం, కార్యకర్తలు, కార్యక్రమం, నిధుల సమకూర్చుకుంటూ బీజేపీ శక్తివంతంగా మారింది. కార్యకర్తలే పార్టీకి బలం. సిద్ధాంతాలే పార్టీకి పునాది, జేపీ నడ్డా ఆధ్వర్యంలో శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించింది.

• ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. బీజేపీ ఆధ్వర్యంలో భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఆర్ధికంగా సుస్థిర స్థానంలో ఉంది.. ఇది నా మాట కాదు.. అమెరికాలో వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం.

• బీజేపీ అంటే ఉత్తరాదికి పరిమితైన పార్టీ అని చాలా మంది విమర్శించారు. దక్షిణాదిలోనూ బీజేపీ సత్తా చాటింది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలోనూ బీజేపీ సత్తా ఏంటో చూపించాం.

• ఎందరో త్యాగాల ఫలితంగానే బీజేపీ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. జంగారెడ్డి వంటి నేతలు ఎన్నో త్యాగాలు చేశారు. కార్యకర్తలు బలిదానం చేశారు కాబట్టే పార్టీ ఈ స్థాయికి చేరింది. జంగారెడ్డి ఏకంగా జనసంఘ్, జనతా, బీజేపీ పార్టీ గుర్తుల నుండి పోటీ చేసి గెలిచారు.

• కచ్చితంగా వారి స్పూర్తితో తెలంగాణలోనూ విజయం సాధించబోతున్నాం. ఇది తెలిసే కేసీఆర్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. జైలుకు పంపుతున్నారు.

• బీజేపీని ఆడిపోసుకుంటూ టైం పాస్ చేస్తున్నారే తప్ప తెలంగాణలో చేసిన అభివ్రుద్ధి చేసింది చెప్పుకోలేకపోతున్నారు.

• ట్విట్టర్ టిల్లు ఖబడ్దార్… ప్రధానిని బ్రోకర్ అంటావా? నీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్… బీజేపీతో పెట్టుకోకు… నీకు దమ్ముంటే అభివ్రుద్ధిపై చర్చకు రా… తెలంగాణకు ఏం చేసినవో చెప్పు. అధికారం ఇస్తే 5 లక్షల కోట్ల అప్పు చేసినవ్…పొరపాటున గెలిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తవ్.

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది జీవితాలు బర్బాద్ అయితే మీ అయ్య ఎందుకు నోరు విప్పడం లేదు? బజారుకు తీసుకుని రా… ఇంతమంది నష్టపోతే నిరుద్యోగులకు నయా పైసా ఇయ్యడం లేదు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చిన విథంగా వాళ్ల ఆధ్వర్యంలో మళ్లీ పరీక్షలు నిర్వహించడం ఎంత దుర్మార్గం. మీ తప్పు లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నీ కొడుకును బర్తరఫ్ చేసి మెడలు పంటి గెంటేయ్.

• పరువు లేనోడు నాపై పరువు నష్టం దావా వేసిండు.. కేసీఆర్ కుటుంబం ఏ దందాను వదిలిపెట్టదు… ఒకామె లిక్కర్, ఒకాయన డ్రగ్స్ దందాలతో చేస్తున్నరు. ఇప్పుడు పరువు నష్టం పేరుతో దందా చేస్తున్నరు. ఆ కుటుంబాన్ని ఉపేక్షిస్తే తెలంగాణను సర్వనాశనం చేస్తారు. అందుకే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి.

• కేంద్రం ఏటా క్రమం తప్పకుండా యూపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే తెలంగాణ సర్కార్ కు ఎందుకు చేతగావడం లేదు? కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా, భ్రుతి ఇచ్చేదాకా పోరాడతాం… తెలంగాణ నుండి బీఆర్ఎస్ ను తరిమి తరిమి కొట్టేదాకా ఉద్యమిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X