గద్దర్ ను అవమానించిన బండి సంజయ్ తెలంగాణ నుంచి తరిమికొడతాం
బీజేపీకి పని చేస్తేనే అవార్డులు ఇస్తారా?
తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి గద్దర్
అమరుడైన గద్దర్ ను పట్టుకొని బాధ్యతారాహిత్యంగా మాట్లాడతావా?
కేంద్ర మంత్రి హోదాలో ఉండి గల్లీ లీడర్ లాగా మాట్లడతావా?
ప్రధాని మోడీనే గద్దర్ గొప్పతనాన్ని పొగిడారు
చెప్పులు మోసిన నీకు మేదస్సు మెదడు లేదు
తెలంగాణను అవమానించిన సంజయ్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టండి
ప్రజలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్
హైదారాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను అవమానకరంగా మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియా తో మాట్లాడారు. గద్దర్ బీజేపీ కార్యకర్తలను చంపించారు, అలాంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలా? అని కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలా? అని ప్రశ్నించారు. సంజయ్ మాటలు గల్లీ లీడర్ కంటే హీనంగా ఉన్నాయని అన్నారు. గద్దర్ అంటే తెలంగాణ అని, తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని తన అట, పాటలతో ఉర్రూతలు ఊహించిన వ్యక్తి గద్దర్ అన్నారు. ఉద్యమంలో ఆట, పాట లేనిదే ఉద్యమే లేదన్నారు.
తన జీవితం మొత్తం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, తెలంగాణ కోసం త్యాగం చేశారన్నారు. అమరుడైన వ్యక్తిని పట్టుకొని అవమానకరంగా మాట్లాడడం ఆయన కుసంస్కారనికి నిదర్శనం అన్నారు. దేశ ప్రధాని మోడీ కూడా తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదని, తెలంగాణ సంస్కృతి, కళలు గద్దర్ పాటలు, కవితల్లో ప్రతిబింబిస్తాయని మోడీ గద్దర్ మరణించినప్పుడు పంపిన సంతాప లేఖలో పేర్కొన్నారు అన్నారు. అలాగే బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు గద్దర్ పాటలలో ప్రతిబింబిస్తాయన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కలలు, కవితలు పునర్జీవింపజేయడంలో గద్దర్ పాత్ర మరువలేనిదన్నారు. ఆయన కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని కొనియాడారు.

దేశ ప్రధానే గద్దర్ సేవలు గురించి కొనియాడితే.. తెలంగాణలో పుట్టి, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి తెలంగాణ కోసం తన జీవితాన్నే సర్వస్వం అర్పించిన గద్దర్ గురించి సంజయ్ మాట్లాడడం దుర్మార్గం అన్నారు. చెప్పులు మోసిన సంజయ్ కు మేధస్సు మెదడులో పెట్టుకోలేకపోయారని ఈ సందర్భంగా అర్ధమైందన్నారు. కళలకు, కవితలకు, సాహిత్యానికి అవార్డు ఇవ్వాల్సి వస్తే గద్దర్ అందుకు పూర్తిగా అర్హులు అవుతారన్నారు. పక్క రాష్ట్రంలో బీజేపీ ని నెత్తిన మోస్తున్నందుకు కళలకు, కళాకారులకు పట్టం కట్టారని ఆరోపించారు. కళలకు, కళాకారులకు అవార్డులు ఇవ్వాల్సి వస్తే ఇంకా తెలంగాణలో గోరేటి వెంకన్న, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చంద్ర బోస్, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారన్నారు. కానీ సంజయ్ వాఖ్యలు చూస్తే బీజేపీకి పని చేస్తేనే అవార్డులు వస్తాయని అన్నట్టుగా ఉందన్నారు.
Also Read-
గద్దర్ పై సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో యావత్ తెలంగాణ బండి సంజయ్ హటావో నినాదాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ను అవమానించిన సంజయ్ కు తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణలో ఉండాలంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ కి టిపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్
ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా ? నాడు ప్రజా యుద్ధ నౌక ఆలింగణం చేసుకున్నప్పుడు భావజాలం గుర్తుకు రాలేదా బండి సంజయ్, బీజేపీ భావజాలం ఉన్న వారికే పద్మ అవార్డులు ఇస్తాము అంటూ కేంద్ర హోమ్ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను సమాజం ఖండించాలి..
మోడీకి రాజ్యాంగ సూత్రాల మీద అవగాహన ఉంటే బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బీజేపీ నేతలు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు చిరస్మరణీయం. కరసేవకుల మీద కాల్పులు చేయించిన నేతలకు అవార్డులు ఇచ్చినపుడు భావజాలం సోయి ఎటుపోయింది. లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు బీజేపీ లో లేరా?
నక్సలిజం నా ఎజెండా అని చెప్పిన ఈటెల రాజేందర్ ను పార్టీ లో చేర్చుకొని ఎలా ఎంపీ పదవి ఏమైంది. నక్సలైట్లు మా దేశ భక్తులు అన్న ఎన్. టి.ఆర్ తో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా. 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది బీజేపీ భావజాలం ఉన్న వారు పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన బీజేపీ మండల అధ్యక్షుల్లో ఎంతమంది మీ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారూ?
బీజేపీ నేతలు సిద్ధాంతాలకు, భావజాలానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి ఎక్కువ కార్పొరేటర్ పదవికి తక్కువ. త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్ష రాబోతున్నాడు.. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందని సంజయ్ ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు.