“బరాబర్ హిందుత్వం మాట్లాడతా… మేం ఏ మతానికి వ్యతిరేకం కాదు”

• టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబోతున్నయ్

• ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

• ప్రజల పీక పిసికి చంపుతారా?… కాపాడుకుంటారో మీరే ఆలోచించుకోండి

• ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే… సర్కార్ మెడలు వంచి పీఆర్సీని వేసేలా పోరాడతాం

• 317 జీవోసహా టీచర్ల సమస్యలపై పోరాడతాం

• ఏవీఎన్ రెడ్డిని గెలిపించకపోతే టీచర్ల సమస్యలపై ప్రశ్నించే వాళ్లే మిగలరు

• ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి..

• ప్రజలను పిసికి చంపుతారా? కాపాడుకుంటారా? ఆలోచించండి

• ఫస్ట్ తేదీన జీతాలు రావాలంటే ఏవీఎన్ రెడ్డిని గెలిపించండి

• బరాబర్ హిందుత్వం మాట్లాడతా… మేం ఏ మతానికి వ్యతిరేకం కాదు

• ఉపాధ్యాయ, అధ్యాపక అత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ వ్యాఖ్యలు

• భారీ ఎత్తున హాజరై తపస్ అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డికి మద్దతు పలికిన ఉపాధ్యాయులు

హైదరాబాద్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం టీచర్లకే పరిమితం కావు… ఇవి తెలంగాణ ప్రజల తల రాతనే మార్చే ఎన్నికలు కాబోతున్నాయి. టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. ఈ ఫలితాలతో ప్రజల పిసికి చంపుతారో… కాపాడుకుంటారో మీరే ఆలోచించండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉపాధ్యాయ లోకానికి పిలుపునిచ్చారు.

• మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగరోంలని చంపాపేటలో ఉపాధ్యాయ, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ బలపర్చిన తపస్ అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్, రూరల్ అధ్యక్షులు సామరంగారెడ్డి, బొక్క నర్సింహారెడ్డి, జూనియర్ లెక్చరర్స్ నాయకులు మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ శంకర్, మనోహర్ రెడ్డి, బాలక్రిష్ణారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్, హన్మంతరావు, బండిసంజయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

ముఖ్యాంశాలు…

• బండి సంజయ్ అఫ్ట్రాల్ కార్పొరేటర్… ఆయనను అధ్యక్షుడు చేస్తే ఏమైతదని ట్విట్టర్ టిల్లు అన్నడు.. మా నాయన ఉపాధ్యాయుడు… సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నా. నేను ఏనాడూ మా నాన్న పేరు చెప్పుకుని రాలేదు. మీ అయ్య లేకపోతే మిమ్ముల్ని కుక్కలు కూడా దేఖవ్. అమెరికాలో చిప్పలు కడిగొచ్చిన మీకు, నా క్యారెక్టర్ కు పొంతనా?

• నేను ప్రజల కోసం, హిందూ ధర్మం కోసం జైలుకు పోయిన. మళ్లీ పోయేందుకు సిద్ధం. 317 జీవో కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ కోసం జైలుకుపోయిన.

• మీ కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నరు. అర్దరాత్రి అరెస్ట్ చేస్తున్నరు. జైళ్లకు పంపుతున్నారు. సీఎం, ఆయన కొడుకు జిల్లాల పర్యటనకు వెళ్తే బీజేపీ కార్యకర్తలను రెండ్రోజుల ముందే అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడుతున్నరు.

• టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు… తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఇవే చివరి ఎన్నికలు. ఆ తరువాత వచ్చేవి అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ ప్రజలంతా ప్రాథేయపడి అడుగుతున్నరు. బీఆర్ఎస్ గెలిస్తే మా బతుకులు ఆగమైతయని ఆందోళన చెందుతున్నరు. నేను ఎక్కడికి పోయినా ప్రజలంతా ఇదే చెప్పమని వేడుకుంటున్నారు.

• ఫస్ట్ నాడు మీకు జీతాలు వస్తే ఓటేసుకోండి… ఎన్నికలున్న జిల్లాల్లో మాత్రమే ఫస్ట్ జీతాలిస్తున్నడు.. బీజేపీ మాట్లాడితే తప్ప జీతాలు ఇయ్యలేని పరిస్థితి.

• ఇయాళ పీఆర్టీయూ, యూటీఎప్ సహా ఉపాధ్యాయ సంఘాల సభ్యులంతా వాస్తవాలు ఆలోచించండి. మీరు మాకు శత్రువులు కాదు.. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేవాళ్లు మాత్రమే మాకు శత్రువు. ఏవీఎన్ రెడ్డికి ఓటేయకపోతే చారిత్రక తప్పిదం చేసిన వాళ్లవుతారు.

• ఇకపై 3 నెలలకోసారి జీతాలిస్తాం… మీరు వెళ్లి టీచర్లతో మీటింగ్ పెట్టి వాళ్లను ఒప్పించాలి. రోడ్లపై ధర్నాలు చేయకుండా చూడాలే. లేకుంటే మీకు పనులేమీ చేయనని సీఎం ఉద్యోగ సంఘాలను పిలిచి చెప్పారు. ఇది తెలిసి ఫస్ట్ నాడు జీతాలియ్యకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేను హెచ్చరించిన.

• మీకో విషయం గుర్తుంచుకోవాలి… ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే ఇకపై మీకు ఫస్ట్ నాడే జీతాలు రావడం ఖాయం. ఎందుకుంటే… అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నయ్. జీతాలియ్యకపోవడంవల్లే ఏవీఎన్ రెడ్డిని గెలిపించారని ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు.

• ఇది తెలిసే ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. మిమ్ముల్ని మళ్లీ లోబరర్చుకునేందుకు, ఆశ పెట్టేందుకు యత్నిస్తున్నారు.

• నేనేనాడు రాజకీయాలు చూడలేదు. 317 జీవోతో టీచర్లు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక దీక్ష చేసిన. ఇది తెలిసి మరెవరూ దీక్ష చేయకూడదు, ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో గ్యాస్ కట్టర్లు తెచ్చి నా ఆఫీస్ ను కట్ చేసి లాఠీలు ఝుళిపించి జైలుకు పంపారు. ఆనాడు టీచర్ సంఘాలేవీ కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. అయినా ఏనాడూ బాధపడలేదు. ఉపాధ్యాయలను బాధల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా 317 జీవో పై పోరాడుతూనే ఉన్నాం.

• ఉపాధ్యాయులు 317 జీవోపై ప్రగతి భవన్, డీఎస్సీ ఎదుట ఆందోళన చేస్తే పసిపిల్లలని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు. దీనిపై సీఎంకు వార్నింగ్ ఇస్తే తప్ప వారిని విడుదల చేయలేదు.

• ఒక్కసారి ఏవీఎన్ రెడ్డిని గెలిపించండి. మీ సమస్యలను పరిష్కరిస్తాడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 317 జీవోను సవరిస్తాం. ఉఫాధ్యాయులకు న్యాయం చేస్తాం.

• స్కూళ్లలో స్కావెంజర్లు లేరు. టీచర్లే టాయిలెట్లు శుభ్రం చేసే దుస్థితి. కేసీఆర్ మానవత్వం లేని మ్రుగం. పీఆర్సీ వేయలేదు. 4 డీఏలు ఇయ్యలేదు. బదిలీలు, ప్రమోషన్లు లేవు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఎన్నికల సమయంలో టీచర్లకు డ్యూటీలు వేయాలంటేనే భయపడుతున్నరు.

• ప్రజలంతా చూస్తున్నరు. తెలంగాణలో మార్పు జరగాలని కోరుకుంటున్నరు. కుటుంబ-అవినీతి-నియంత పాలనకు స్వస్తి పలకాలని కోరుకుంటున్నారు. అందుకే వారంతా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. 120 రోజులపాటు ప్రజా సంగ్రామ యాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.

• దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించాం. హుజూరాబాద్ లో ఓడించాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బుద్ది చెప్పినం. మునుగోడులో ఒక్కో పోలింగ్ బూత్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నియమించి, ఓటుకు వేలాది రూపాయలిచ్చినా గట్టి పోటీ ఇచ్చినం.

• జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందువుల దమ్మేందో చూపించారు. 4 సీట్లున్న బీజేపీని 48 సీట్లు గెలిపించారు. నేను హిందూ మతం గురించి మాట్లాడతా. ఏనాడూ అల్లా, క్రీస్తును కించపర్చలేదు. కానీ ఓటు బ్యాంకు కోసం టీఆర్ఎస్, ఎంఐఎం హిందువులను కించపర్చేలా చేస్తున్నరు. అయ్యప్ప స్వామిని, సరస్వతి అమ్మవారిని కించపరిస్తే స్పందించడం లేదు. పైగా వాళ్లను హీరోలుగా చిత్రీకరిస్తున్నారు. ఇంకెన్నాళ్లు భరిద్దాం?

• బరాబర్ బీజేపీ స్పందిస్తాం.. ఎదిరిస్తాం.. బీహార్ లో ఏం జరిగింది? ఎంఐఎం పార్టీ 5 సీట్లు గెలిచింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ లో ఎంఐఎం పార్టీ లేనేలేదు. ఏ హామీలివ్వలే. అయినా ఎందుకు ఆ పార్టీ బీహార్ లో 5 సీట్లు ఎట్లా గెలిచిందో తెలుసా?…. ఆ వర్గం ఓటు బ్యాంకు. 12 శాతం ఓటుతో 5 సీట్లు గెలిస్తే… తెలంగాణలో 80 శాతం ఓట్లున్న బీజేపి ఎన్ని సీట్లు గెలవాలో ఆలోచించండి.

• జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తానంటే చాలా మంది విమర్శించారు. నేను వెనుకాడలేదు. భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు వెళతానంటే అనుమతి ఇయ్యలే.. నేను ఆగలేదు. అనుమతిస్తే భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద సమావేశం పెడతా… ఇయ్యకపోతే పాతబస్తీ గల్లీగల్లీ వెళ్లి మీటింగ్ పెడతానంటే దిగొచ్చి అనుమతిచ్చారు. పాతబస్తీకి వెళ్లాలంటే ఒవైసీ అనుమతి కావాలా? ఆ అవసరం మాకు లేదు. వందేమాతరం, జై శ్రీరాం, భారతమాతాకీ జై అంటూ తెగించి కొట్లాడే పార్టీ బీజేపీ.

• పాతబస్తీని న్యూసిటీ చేద్దామా? వద్దా?.. పాతబస్తీకి కంపెనీలు ఎందుకు రావడం లేదు? ఇంకా డ్రైనేజీ లేక, రోడ్లు లేక ఇబ్బంది ఎందుకు పడుతోంది? అని నిలదీస్తే దిగొచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూలగొడ్తానన్నరు. పీవీ ఘాట్ ను కూల్చేస్తానన్నరు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు వేసుకుంటారని, పీవీ అయోధ్యలో రామ మందిరం కు అనుమతి ఇచ్చారనే కోపంతోనే ఒవైసీ వాళ్ల విగ్రహాలను కూల్చేస్తానన్నారు.

• ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే మీ సమస్యలపై ప్రశ్నించే వాళ్లు ఉండరు. మోదీ పాలన చూడండి.. కేసీఆర్ పాలనను చూడండి. మోదీ పాలనను ప్రపంచమంతా కీర్తిస్తోంది. కేసీఆర్ పాలనను దేశమంతా అసహ్యించుకుంటోంది.

• కేసీఆర్ పాలనలో టీచర్లు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. చివరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు సైతం ఆత్మహత్య చేసుకున్నారంటే కేసీఆర్ పాలన ఎట్లుందో అర్ధం చేసుకోండి..

• ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వ మెడలు వంచి పీఆర్సీని వేయిస్తాం.. ఫస్ట్ తారీఖునే జీతాలిప్పిస్తాం.. 317 జీవోపై పోరాటం చేస్తాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X