బీజేపీ అధికారంలోకి వస్తే… మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతు చూస్తాం…

యూపీ తరహాలో బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లు కూల్చేస్తాం

రోజుకో హత్య, అత్యాచారం జరుగుతున్నా సీఎం పట్టించుకోరా? హోంమంత్రి అసలు ఉన్నారా?

మహిళలను రాష్ట్రపతిసహా ఉన్నత పదవుల్లో నియమించి గౌరవిస్తున్న నరేంద్రమోదీ

తెలంగాణలో మహిళలను చితి మంటలపై పేరుస్తున్న మూర్ఖుడు కేసీఆర్

రాష్ట్రంలో మహిళలంటే కేసీఆర్ బిడ్డే… నిధులు, పదవులన్నీ ఆమెకేనా?

జీతాలియ్యడానికే నిధుల్లేవంటున్న కేసీఆర్… బిడ్డ లిక్కర్ దందాకు వంద కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి?

బీఆర్ఎస్ గూండాలు వైఎస్ షర్మిలసహా మహిళలను దారుణంగా కించపరుస్తుంటే సహించాలా?

భారతీయుడిగా పుట్టిన వారెవరికీ మహిళలను కించపర్చే సంస్క్రుతి లేదు

నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా శ్రీమతి గొప్పతనమే

కేసీఆర్ రాక్షసుడు కాబట్టే… మోదీ దేవుడయ్యాడు

వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కేసీఆర్…. బెస్ట్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్ మోదీ

కేసీఆర్ కు సీఎం పదవి బీజేపీ పెట్టిన భిక్షే…

తెలంగాణ బిల్లుకు మద్దతివ్వకుంటే కేసీఆర్ కొడుకు అమెరికాలో చిప్పలు కడిగేటోడు

మంచి నీళ్లు లేని ఊళ్లలో మద్యం ఏరులై పారుతోంది… బెల్టు షాపులను నియంత్రించాల్సిందే

స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు సక్సెస్ చేసిన తెలంగాణ కార్యకర్తలను నడ్డా, అమిత్ షా అభినందించారు

అభివ్రుద్ధిపై చర్చించడం చేతగాని ట్విట్టర్ టిల్లు కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నడు

హిందూ మతాన్ని, దేవుళ్లను కించపర్చే వాళ్ల తాట తీయండి

గెలిచే సత్తా ఉన్న మహిళా మోర్చా నాయకులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తాం

బిజేపీ సింహం…సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వస్తాం

మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : ‘‘అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే గుడ్లు పీకేస్తానని కేసీఆర్ గతంలో చేసిన హెచ్చరికలన్నీ ఉత్తమాటలే… బీజేపీ అధికారంలోకి వస్తే… మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నాకొడుకుల అంతు చూస్తాం. యూపీ తరహాలో బుల్ డోజర్లతో వాళ్ల ఇండ్లు కూల్చివేస్తాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎస్టీ సామాజికవర్గ మహిళను రాష్ట్రపతిగా చేయడంతోపాటు

మహిళలకు ఉన్నత పదవులిచ్చి గౌరవిస్తుంటే… రాష్ట్రంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ మహిళలు, బాలికలను చితిపై పేర్చే దుస్థితి ఏర్పడిందంటూ మండిపడ్డారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ తోపాటు మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, చింతల రామచంద్రారెడ్డి, జాతీయ కార్యదర్శి పద్మజా మీనన్, నళిని, ఆకుల విజయ, డాక్టర్ పద్మ, కరుణ గోపాల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• సీఎం కేసీఆర్ చేతగానితనంవల్ల ప్రీతి మరణిస్తే మహిళా మోర్చా దమ్ము చూపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. సైఫ్ అనే సైకో చేసిన హత్య, సీఎంఓ నుండి వచ్చిన ఫోన్ తో ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారు.

• మోదీ ప్రభుత్వం ఎస్టీ సామాజికవర్గ మహిళను రాష్ట్రపతిగా చేసి గౌరవిస్తే… రాష్ట్రంలో ఎస్టీ మహిళలు, బాలికలను చితిపై పేర్చే దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ గతంలో ఎవరైనా తప్పు చేస్తే గుడ్లు, పీకేస్తా అని చేసిన హెచ్చరికలు ఉత్తమాటలే… యూపీలో బుల్ డోజర్లు పడుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే… మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే లుచ్చా నాకొడుకుల అంతు చూస్తాం. యూపీ తరహాలో బుల్ డోజర్లతో వాళ్ల ఇండ్లు కూల్చివేస్తాం.

• మోదీ గారు దేశ రక్షణ మంత్రిగా సీతారామన్ ను నియమించారు. ఇంటికి తాళం చెవి ఇస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది. అట్లాగే 40 లక్షల కోట్ల దేశ బడ్జెట్ ను సీతారామన్ చేతిలో పెట్టారు. 12 మంది మహిళా మంత్రులను, 8 మంది గవర్నర్లను, 4గురిని సీఎంలుగా చేసిన ఘనత నరేంద్రమోదీదే.

• కేంద్రం పీఎంఏవై కింద ఇస్తున్న ఇండ్లు, గ్యాస్ కనెక్షన్లు సహా అన్నీ మహిళల పేరిటే ఇస్తున్నారు. ఆనాడు మోదీ ఎర్రకోటపై టాయిలెట్ల గురించి మాట్లాడితే ఎద్దేవా చేశారు. కానీ 30 కోట్ల టాయిలెట్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత నరేంద్రమోదీదే.

• రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతోంది. మహిళలను పట్టించుకునే పాపాన పోలేదు. జూబ్లిహిల్స్ సంఘటన నుండి నిన్నటి ప్రీతి హత్య వరకు అనేక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కేసీఆర్ స్పందించరు. హోంమంత్రి ఉన్నరా? లేరా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో మహిళలంటే కవిత మాత్రమేనా? నిధులు, దందాలన్నీ ఆమెకేనా? మహిళల గురించి పోరాడేది మహిళా మోర్చా మాత్రమే.

• రాష్ట్రంలో బీజేపీయే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. 1999లో చంద్రబాబు ప్రత్యామ్నాయం.. 2004లో కాంగ్రెస్, 2014లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కన్పించింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. మార్పు కోరుకుంటున్నారు. మహిళలు తలెత్తుకుని తిరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.

• ప్రజా సమస్యలపై కొట్లాడే పార్టీ బీజేపీ. ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ఎదురించి యుద్దం చేస్తున్న కార్యకర్తలు బీజేపీ. అందుకే ప్రజలు మనవైపు చూస్తున్నారు. పేదలంతా బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని భావిస్తున్నారు. కుటుంబ పాలనను అంతం కావాలని కోరుకుంటున్నరు.

• 2014కు ముందు ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ పాలనలో అప్పులపాలైంది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు.

• నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాననంటే మా శ్రీమతి గొప్పతనమే. షర్మిల గారిని బూతులు తిట్టడం దారుణం. ఆమె ఏ పార్టీ అయినా కానీ మహిళలను దూషించడం దారుణం. సనాతన భారతీయ సంస్క్రతి చెబుతోంది. తోటి మహిళలను తల్లిగా, సోదరిగా గౌరవించాలి. నిజంగా భారతీయుడైతే, మనిషివైతే మహిళలను కించపర్చరు. బీజేపీ సింహం. సింగిల్ గానే పోటీ చేస్తుంది. అధికారంలోకి వస్తుంది.

• బండి సంజయ్ అంటే కేసీఆర్ కొడుకుకు భయం పట్టుకుంది. కేసీఆర్ కొడుకు పేరును ప్రస్తావించొద్దని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నడు. కార్పొరేటర్ నైన నన్ను అధ్యక్షుడిని చేస్తే తప్పేంది? ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా, చాయ్ వాలాను ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. టీఆర్ఎస్ లో ఆ అవకాశం ఉంటుందా? మహిళ అంటే కేసీఆర్ బిడ్డే. లిక్కర్ దందాతో తెలంగాణ పరువు తీస్తోంది. కవితను అరెస్ట్ చేయాలని ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో మహిళలను ఏకం చేసి జిల్లా మహిళా మోర్చా నాయకులు పోరాడుతున్నరు.

• డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు, జీతాలు, మ్యాచింగ్ గ్రాంట్లు అడుగుతుంటే పైసలు లేవని చెబుతున్న కేసీఆర్… ఆయన బిడ్డ లిక్కర్ దందాకు వందల కోట్లు ఎట్లా వచ్చాయి? మీ కుటుంబం అక్రమ దందాలకు వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలి.

• గతంలో లిక్కర్ ద్వారా రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తే… ఇయాళ రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోంది. సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నరు. 10 వేల కోట్లు మిగులుతోంది. ఒక్కో కుటుంబం కేసీఆర్ ప్రభుత్వం మద్యం ద్వారా రూ.50 వేలు ఇస్తోంది. కేసీఆర్ మాత్రం ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారు. జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు.

• ఉద్యోగులకు 3 నెలల వరకు జీతాలిచ్చే పరిస్థితి లేదు… ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు అర్ధమయ్యేలా చెప్పాలని కేసీఆర్ గతంలో బెదిరించారు. ఇది గమనించే ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నం. ఈరోజు ఉద్యోగులతోపాటు నిరుద్యోగులు, మహిళలు, రైతుల పక్షాన పోరాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నాం.

• టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా చేసినా సాధించేదేమీలేదు. ఇచ్చిన హామీలే అమలు చేయలేనోడు. మహిళా వర్శిటీని ఏర్పాటు చేస్తామని ఇంతవరకు అమలు చేయని మూర్ఖుడు.

• ఏ అధికార పార్టీ అయినా ఎన్నికల్లోకి వెళితే అభివ్రుద్ధిపై జనంలోకి వెళ్లడం సహజం. కానీ కేసీఆర్ ఆ పనిచేయడం లేదు. ఎందుకంటే అభివ్రుద్ధి చేసిందేమీ లేదు. ప్రజలను దారి మళ్లించేందుకు కేంద్రాన్ని తిట్టడం, సెంటిమెంట్ రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నరు.

• పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాం. వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పించాం. కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోననే విషయాన్ని తీసుకెళ్లగలిగాం. కేసీఆర్ రైతు బంధు, కళ్యాణలక్ష్మీ, పెన్షన్లు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదు.

• పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతివ్వడంవల్లే కేసీఆర్ సీఎం అయ్యారు. బీజేపీ భిక్షతోనే కేసీఆర్ కుటుంబం ఇయాళ అధికారంలోకి ఉంది. బీజేపీ మద్దతివ్వకుంటే కేసీఆర్ దొంగ పాస్ పోర్టులు చేసుకుని బతికేటోడు..కేసీఆర్ కొడుకు అమెరికాలో చిప్పలు కడిగేటోడు. ఆ ఒక్క కుటుంబం కోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? పేదల బతకలేని దుస్థితి ఏర్పడింది.

• ట్విట్టర్ టిల్లుకు సిగ్గు లేదు… కేంద్రం ఏమిచ్చిందంటూ ప్రతిసారి సోయి లేకుండా మాట్లాడుతున్నడు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో చర్చకు సిద్ధమని చెబితే పారిపోతున్నడు.

• బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా సమావేశాలుసహా ఏ మీటింగ్ లు పార్టీ కార్యాలయంలో పెట్టినా పోలీసుల బందోబస్తు పెడుతున్నారు.

• రాష్ట్రంలో ఈరోజు జరుగుతునన్న హత్యలు, అత్యాచారాలకు, దాడులకు ప్రధాన కారణం మద్యం అమ్మకాలే. తాగడానికి నీళ్లు లేవు కానీ మద్యానికి ఢోకా లేకుండా చేస్తున్నారు. బెల్టు షాపులను నిషేధించాల్సిన అవసరం ఉంది.

• మోదీ హీరో.. మీ అయ్య రాక్షసుడిలెక్క కన్పిస్తున్నడు కాబట్టే మోదీగారు దేవుడి లెక్క కన్పిస్తున్నడు. తప్పేముంది? రెండు సార్లు గెలిచి ప్రధాని అయ్యారు… మూడోసారి గెలిచి మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నరు. ప్రపంచమంతా మోదీగారిని బెస్ట్ పీఎంగా కొనియాడుతుంటే… వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియాగా కేసీఆర్ ను చీత్కరిస్తున్నరు.

• చైనా నేటికీ కోవిడ్ నుండి బయటకు రావడం లేదు.. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించడమేకాకుండా యావత్ ప్రపంచమంతా ఆర్ధికంగా అల్లాడుతుంటే… దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతున్న ఘనత మోదీదే.

• దిగుమతుల స్థాయి నుండి ఎగుమతుల స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీదే. ఒకనాడు మోదీని తమ దేశంలోకి రానీయబోమని చెప్పిన వాళ్లే ఈరోజు మోదీకి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలుకుతున్నారు. కేసీఆర్ ను ఎవరూ దేఖడం లేదు. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ లీడర్లను బీఆర్ఎస్ లోకి చేర్చుకుని షో చేస్తున్నడు.

• బీఆర్ఎస్ పార్టీ మూతపడ్డ ఫైనాన్స్ దుకాణానికి కొత్త తగిలించినట్లయింది. కేసీఆర్ కు తెలంగాణతో బంధం తెగిపోయింది. తెలంగాణను తాకట్టు పెట్టిన కేసీఆర్ రాక్షస పాలనపై మహిళా మోర్చా మరింతగా పోరాడాలి. అధికారంలోకి రావాలంటే ఈ పోరాటాలు ఏమాత్రం సరిపోవు… ఇంకా కష్టపడాలి.

• మహిళలుసహా కార్యకర్తలంతా కష్టపడటంవల్లే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు సక్సెస్ అయ్యాయి. హిందూ ధర్మాన్ని, దేవుళ్లను కించపరుస్తున్న బైరి నరేష్ లాంటి వాళ్లకు తగిన బుద్ది చెబుతున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్… పార్టీ కోసం, దేశం, ధర్మం కోసం జైలుకు వెళ్లేందుకు వెనుకాడని వాళ్లకు నా అభినందనలు.. మహిళల పక్షాన పోరాడుతున్న మహిళా మోర్చా నేతలుండటం గ్రేట్.

• కష్టపడి పనిచేస్తూ గెలిచే అవకాశమున్న మహిళా నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే బాధ్యత నాది. ఈసారి ఎక్కువ మంది మహిళా మోర్చా నాయకులు ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నా. డబ్బుల గురించి ఆలోచించొద్దు.. ప్రజల తరపున కొట్లాడండి.. నేను సామన్య కార్యకర్తను. కార్పొరేటర్ గా ఉన్న నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను. 9 ఏళ్లు పార్టీలో నాకు ఏ పదవి లేదు.. అయినా జనంలోనే ఉన్నా.. పార్టీ ఆఫీస్ లో కార్యకర్తగా ఉన్న కిషన్ రెడ్డి ఇయాళ కేంద్ర మంత్రి అయ్యారు. కష్టపడే వాళ్లకు బీజేపీలో తప్పకుండా గుర్తింపు వస్తుంది.

మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్…

• ఈ దేశంలో అత్యంత సుందరమైన భాష తెలుగు…ఇది ప్రముఖ తమిళ కవి చెప్పిన మాట. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా వివిధ అంశాలపై చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. మహిళలపై అత్యాచారాలు, మహిళా ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు.

• గతంలో మరుగుదోడ్లు, మహిళలకు కనీస సౌకర్యాలు లేవు. ఈరోజు మహిళా సాధికారతలో ముందున్నాం. కోట్ల మంది మహిళలు కేంద్ర పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు. ఆ అంశాన్ని తెలంగాణలోని ప్రతి మహిళ వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మహిళా మోర్చాపై ఉంది.

మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ….

• పార్టీ నాయకత్వం, మహిళా జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు బీజేపీకి పోటీగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. ప్రభుత్వం, పోలీసుల నుండి ఒత్తిళ్లు వస్తున్నా మహిళా సమస్యలపై పోరాడుతుండటం చిన్న విషయం కాదు.. పిల్లలకు పోషకాహారం పెట్టడం లేదు. ఏఎన్ఎం, అంగన్ వాడీలకు సక్రమంగా జీతాల్లేవు.

• కవితకు తప్ప మహిళలకు రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు. తెలంగాణలోని ఆడపిల్లలకు కవిత చీడ పురుగులా దాపురించింది. తలవంపులు తెచ్చింది. వేల కోట్ల దోపిడీ చేస్తోంది. అత్యాచారాలు, మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాలో, గ్రుహ హింసలో తెలంగాణ నెంబర్ వన్ గా మారింది. ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

• బీజేపీతోనే మనకు పోటీ… బీజేపీ కంటే ఎక్కువ పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహిద్దాం… ఈ విషయంలో మనందరం పూర్తి సమయం మహిళల కోసం వెచ్చిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X