ప్రత్యేకమైన అవార్డులు – సాహిత్యకారుల కోసం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పాత్రను పోషిస్తున్న కవులు, రచయితలు, విమర్శకులకు జాతీయ స్థాయి గుర్తింపు కల్పించడం కోసం, కవి యాత్ర ఆధ్వర్యంలోప్రత్యేకంగా ఉత్తమ అవార్డులను ఒక్కొక్కరికి రూ.5000 నగదు ఐదుగురికి అందజేయనున్నట్లు సగర్వంగా ప్రకటించుకుంటున్నాము.
మేము కేవలం కవిత్వానికే కాదు, సాహిత్య ప్రక్రియలన్నింటికీ విలువనిచ్చే ప్రయత్నంలో భాగంగా, వివిధ భాషల నుండి కవులు, రచయితలు, విమర్శకులు అందరూ తమ రచనా ప్రక్రియకు, సాహిత్య సేవకు గుర్తింపుని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాము.
Also Read-
అవార్డుల ప్రాధాన్యత:
- ఉత్తమ కవియాత్రికులు అవార్డు: కవి యాత్రలో పాల్గొన్న ప్రతీ కవికి ఇది ప్రత్యేకంగా అందజేయబడుతుంది.
- జాతీయ స్థాయి సాహిత్య అవార్డులు: అన్ని సాహిత్య ప్రక్రియలకు – కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, అనువాదాలు, విమర్శ – విభాగాల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు అవార్డులు అందజేస్తాము.
పాత్రతా ప్రమాణాలు:
- రచనలు సాహిత్య, సామాజిక విలువలను ప్రతిబింబించాలి.
- భారతీయ సాహిత్య సేవకు ప్రత్యేకమైన కృషి చేసినవారికి ప్రాధాన్యత.
- ప్రతి అభ్యర్థి కవి యాత్ర సభ్యుడిగా ఉండాలి లేదా సభ్యత్వాన్ని పొందాలి.
అర్హతలు:
రచయితల వ్యక్తిగత వివరాలు, ప్రచురణలు, మరియు సాహిత్య కృషిని వివరించే సమగ్ర నివేదికను సమర్పించాలి.
రాసిన రచనల నుంచి మూడు కాపీలు, అవసరమైన చోట అనువాదాలు కూడా అందించాలి.
చివరి తేదీ:
అభ్యర్థిత్వాలను అందించడానికి చివరి తేదీ మార్చి 15, 2025.
మరిన్ని వివరాలకు:
kaviyatra11@gmail.com ద్వార సంప్రదించండి
మా లక్ష్యం: ప్రేమ, శాంతి, జ్ఞానం ప్రపంచానికి చాటడం
భారతీయ సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులు, రచయితలు, విమర్శకులను ఒక్కటిగా సమకూర్చి, వారి ప్రతిభకు గుర్తింపునిస్తూ సాహిత్య కృషిని ప్రపంచానికి పరిచయం చేయడం.
మీ రచనలకు కవి యాత్ర ద్వారా న్యాయమైన గుర్తింపు పొందండి. మీ సాహిత్య కృషి చరిత్రలో నిలిచేలా చేయండి!
మీ సాహిత్య ప్రస్థానాన్ని గొప్పగా ఉంచే అవకాశం ఇదే! అవార్డులను హైదరాబాద్లోని రవీంద్ర భారతి కి వచ్చి ప్రముఖల నుండి అందుకోవాల్సి ఉంటుంది.
– కవి యాత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కారం శంకర్