హైదరాబాద్ : బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజాంజాహీ మార్కెట్ కూడలి వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం.’’ అనే నినాదంతో మహా పాదయాత్రలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు కనీవినీ ఎరుగని రీతిలో భారీగా తరలివచ్చి విజయవంతం చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాoచందర్ రావు కొనియాడారు. పాదయాత్రలో అడుగడుగునా ఉత్సాహం నింపిన కార్యకర్తలకు, ప్రజలకు, భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తరఫున, తెలంగాణ బీజేపీ శాఖ తరఫున ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపైనా, బీజేపీపైనా, చివరకు దేశ రాజ్యాంగబద్ధ సంస్థలపైనా కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు పచ్చి అబద్ధాలతో విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా దేశ పౌరుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను దగా చేయాలని, తప్పుదోవ పట్టించాలని కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు.
Also Read-
కాంగ్రెస్, ఇండి కూటముల ఈ విషపూరిత కుట్రలను, దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టడానికే సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హైదరాబాద్ గడ్డపై మన మధ్యకు వచ్చి ఈ రెండు కిలోమీటర్ల మహా పాదయాత్రలో మనతో కలిసి అడుగులు వేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్, ఇండి కూటమి చేసే అసత్య ప్రచారాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, కాం
