పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు.

ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరాం: టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

హిమాయత్‌నగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇవ్వాలని సీపీఐ నాయకులను కోరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నాయకుల మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య రాజకీయ సమన్వయం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తదితర అంశాలపై చర్చించారు.

ఇండియా కూటమిలో సీపీఐ భాగస్వామిగా ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో సీపీఐతో కలిసి ముందుకు సాగుతున్నామని తెలిపారు. రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సీపీఐ మద్దతు కోరినట్లు వెల్లడించారు. అలాగే, ఎన్నికల్లో మద్దతు కోసం సీపీఎంతోనూ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. సీపీఐ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar