TRS పేరును”BRS” గా ఆమోదిస్తూ ECE నుంచి CM KCRకి అధికారికంగా లేఖ అందింది, రేపు ఘనంగా ఆవిర్భావ కార్యక్రమం

Hyderabad: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కి అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో… రేపు అనగా డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1. 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం సీఎం కేసిఆర్ గారు బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు.

వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 5న‌ ద‌స‌రా శుభఘ‌డియ‌ల్లో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా కేసీఆర్ అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు.

టీఆర్ఎస్ పేరును మారుస్తూ ద‌స‌రా రోజున‌ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు కూడా టీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఆ రోజున‌ తీర్మాన ప్ర‌తిని కేసీఆర్ చ‌దివి వినిపించారు. దీంతో పార్టీ నాయ‌కులు, శ్రేణులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X