మహారాష్ట్రలో వరద పరిస్థితి దృష్ట్యా మణిక్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల రాకపోకలను సులభతరంచేసిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో, ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు మాణిక్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో తక్షణ చర్యలు చేపట్టింది.

గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా రాజూరా మరియు బల్హర్షా మధ్య రహదారి అనుసంధానానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సురక్షితమైన, విశ్వసనీయమైన ప్రయాణం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైలు రవాణాపై ఆధారపడవలసి వస్తోంది.

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో నుంచికొని దక్షిణ మధ్య రైల్వే మణిక్‌గఢ్‌లో 5 రైళ్లకు తాత్కాలిక నిలుపుదల కల్పించింది తద్వారా 400 మందికి పైగా ప్రయాణికులు బల్హర్షాతో సహా సమీప గమ్యస్థానాలకు తమ ప్రయాణాలను కొనసాగించడానికి వీలు కలిగింది.

Also Read-

మాణిక్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే సిబ్బంది ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. టిక్కెట్ల జారీని సజావుగా నిర్వహించడం, ప్రయాణికులకు అవసరమైన మార్గదర్శకత్వం కల్పించడం, రైళ్లలో క్రమబద్ధంగా ఎక్కేలా సమన్వయం చేయడం, అలాగే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ప్రయాణికుల సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి అవసరమైన అన్ని సహాయాక చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X