హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడి మరణం ఈ సమాజానికి తీరని లోటు.

ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి, ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read-

కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు.
కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రయాణం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతతో ఐదు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.5గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
జూలై 26వ తేదీన ఉదయం హనుమకొండలోని తన నివాసంతో పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన పట్టణంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు దాదాపు తొమ్మిది సార్లు సీపీఆర్ చేసి, ఆగిపోయిన గుండెకు లయ తెప్పించారు. అయినప్పటికీ స్పృహలోకి రాకపోవడం, పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి తరలించారు.
తెలంగాణ సాధనకు అండగా నిలిచిన ఆదర్శ నాయకుడైన సుదర్శన్ రెడ్డి, 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) తరఫున జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2004లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికై, ఆ తర్వాత 2002లో రాష్ట్ర పార్టీ కన్వీనర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
