అతిపెద్ద మరియు ఉత్తమ వార్త : ప్రముఖ చిత్ర నిర్మాత, రచయిత, నటుడు బి. నరసింగరావుకి గౌరవ డాక్టరేట్

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం బుధవారం, అక్టోబర్ 7, 2026న ఉదయం 10:30 గంటలకు భవనం వెంకట్రామ్ ఆడిటోరియం, యూనివర్సిటీ క్యాంపస్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌లో జరగనుందని యూనివర్సిటీ వైస్ – ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి బుధవారం టూరిజం ప్లాజా లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.

ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ గౌరవ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా గారు ముఖ్య అతిథిగా హాజరై ఎం.ఫిల్, పీహెచ్.డీ పట్టాలు, యుజి/పిజి డిగ్రీలు, బంగారు పతకాలు మరియు బుక్ ప్రైజ్‌లను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. న్యాక్ మాజీ డైరెక్టర్, డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వి. ఎస్. ప్రసాద్ స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవంలో ప్రముఖ చిత్ర నిర్మాత, రచయిత, నటులు బి. నరసింగరావు కి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. వైస్ – ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ/పీజీ/డిప్లొమా/సర్టిఫికెట్లు కోర్సుల్లో పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

ఘంటా చక్రపాణి మాట్లాడుతూ మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీలు/డిప్లొమాలు/సర్టిఫికెట్లు అందుకోనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో 17,960 మంది. పి.జి/డిప్లొమా/సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌లో 18,185 మంది. 19,800 మంది మహిళా విద్యార్థులు డిగ్రీలు అందుకుంటున్నారు. 16,334 మంది పురుష విద్యార్థులు డిగ్రీలు అందుకుంటున్నారు. 43 మంది (యుజి-4, పిజి-39) ఆర్మీ సిబ్బంది పట్టభద్రులవుతున్నారు (పురుషులు-37, మహిళలు-6). 11 మంది ట్రాన్స్‌జెండర్లు తమ డిగ్రీలను అందుకుంటున్నారు. ఎం.ఫిల్, పిహెచ్.డి డిగ్రీలు: 23 మంది పరిశోధక విద్యార్థులకు పిహెచ్.డి, ఒకరికి ఎం.ఫిల్ డిగ్రీ ప్రదానం చేయనున్నారు. 38 బంగారు పతకాలు (యుజిలో 16, పిజిలో 22). మొత్తం 38 పతకాల్లో మహిళలు 29, పురుషులు 09. యుజిలో మహిళలు 14, పురుషులు 02 బంగారు పతకాలు సాధించారు. పిజిలో మహిళలు 15, పురుషులు 07 బంగారు పతకాలు సాధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన ఒక ఖైదీ ఒకే ప్రయత్నంలో అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై బంగారు పతకం మరియు బుక్ ప్రైజ్ సాధించడం విశేషం. గత 45 ఏళ్లలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సుమారు 6,27,175 డిగ్రీలు ప్రదానం చేసినాము.

Also Read-

27 మంది ఖైదీలకు డిగ్రీలు:

ఈ ఏడాది స్నాతకోత్సవ ప్రత్యేకత ఏమిటంటే 26 మంది పురుష ఖైదీలు, ఒక మహిళా ఖైదీతో సహా మొత్తం 27 మంది (చెర్లపల్లి సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైలు నుండి) డిగ్రీలు అందుకుంటున్నారు. అందులో యుజి 12, పిజి 15 మంది ఉన్నారు.

ఒకటి కంటే ఎక్కువ బంగారు పతకాలు పొందినవారు – యుజి ప్రోగ్రామ్స్:

బొజ్జనపల్లి శ్రీ ఆశ్రిత (అడ్మిషన్ నెం. 1932250921) మూడు బంగారు పతకాలు సాధించారు. కడియాల సాయిభాను (అడ్మిషన్ నెం. 0562210452) రెండు బంగారు పతకాలు సాధించారు. హజీరా బేగం (అడ్మిషన్ నెం. 1942233723) రెండు బంగారు పతకాలు సాధించారు. శివ పార్వతి చిప్పల (అడ్మిషన్ నెం. 1262248043) రెండు బంగారు పతకాలు సాధించారు. నుకపెయ్యి సురేష్ (అడ్మిషన్ నెం. 0742243912) – ఖైదీ – యుజిలో ఒక బంగారు పతకం మరియు బుక్ ప్రైజ్ కూడా సాధించారు.

ఒకటి కంటే ఎక్కువ బంగారు పతకాలు పొందినవారు – పి.జి. ప్రోగ్రామ్స్:

మంతెన శ్రీదేవి (అడ్మిషన్ నెం. 02124071205) రెండు బంగారు పతకాలు సాధించారు.
తోట శ్వేత (అడ్మిషన్ నెం. 02123283608) రెండు బంగారు పతకాలు సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar