హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read-
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు.
