హైదరాబాద్ : ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఒక ప్రాణాధారం అని, సమాజంలో సత్యాన్ని వెలికితీసే బాధ్యతను మీడియా నిర్వర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పత్రికలు, మీడియా సంస్థలు ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ, ప్రభుత్వ పనితీరును సమీక్షిస్తూ, సమాజానికి దిశానిర్దేశం చేసే పాత్రలో మీడియా ఎంతో కీలకమని అన్నారు.
Also Read-
ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ వృత్తి నిబద్ధతను కాపాడుకుంటూ నిజాయితీగా పని చేయాలని ఆకాంక్షించారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడంలో మీడియా పాత్ర మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు.
