तेलंगाना में पंचायत चुनाव समाप्त, उस गांव में भीड़े उम्मीदवार…! తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు

हैदराबाद: तेलंगाना में पंचायत चुनाव खत्म हो गए हैं। पहला फेज़ (11 दिसंबर) और दूसरा फेज़ (14 दिसंबर) खत्म हो गया और तीसरे फेज़ (17 दिसंबर) की वोटिंग हुई। सुबह 7 बजे शुरू हुई वोटिंग दोपहर 1 बजे खत्म हुई। जो लोग पोलिंग स्टेशन पर पहुंचे और लाइनों में थे, उन्हें वोट देने का मौका दिया गया। पूरे तेलंगाना में 70 परसेंट से ज़्यादा वोटिंग हुई। वोटों की गिनती दोपहर 2 बजे शुरू होगी। वार्ड मेंबर के वोटों की गिनती के बाद सरपंच के वोट गिने जाएंगे। आज ही उप-सरपंच भी चुने जाएंगे।

आखिरी तीसरे फेज़ के चुनाव के लिए 182 मंडलों में कुल 4,159 ग्राम पंचायतों के लिए नोटिफिकेशन जारी किया गया। 11 सरपंच पद के लिए नॉमिनेशन फाइल नहीं किए गए। बाकी 394 सरपंच निर्विरोध चुने गये। दो ग्रामपंचायत में कोर्ट के चुनाव पर रोक लगाने के कारण बाकी 3,752 पंचायतों के लिए आज वोटिंग हुई। 36,452 वार्ड में चुनाव के लिए नोटिफिकेशन जारी किए गए थे, लेकिन 116 सीटों पर नॉमिनेशन फाइल नहीं हुए थे। 7,908 वार्ड निर्विरोध चुने गये।। कोर्ट ने 18 वार्ड में चुनाव पर रोक लगा दी। इसके साथ ही, बाकी 28,410 वार्ड के लिए आज वोटिंग हुई।

यहां झड़पें हुईं

वोटिंग के दौरान कई जगहों पर झड़पें हुईं। विकाराबाद ज़िले के परिगी मंडल के मादाराम गांव में एक पोलिंग स्टेशन पर दो ग्रुप्स के बीच इस शिकायत पर लड़ाई हो गई कि लोग वोट मांग रहे हैं। कांग्रेस और बीआरएस के सरपंच कैंडिडेट्स और उनके सपोर्टर्स ने एक-दूसरे पर हमला कर दिया। इस हमले में सरपंच कैंडिडेट बोइनी रामुलु घायल हो गया और उसे परिगी गवर्नमेंट हॉस्पिटल ले गये। वरंगल ज़िले के चेन्नारावपेट मंडल में एक पोलिंग स्टेशन पर चुनाव कैंपेन को लेकर दो ग्रुप्स में झड़प हुई। पुलिस को तुरंत अलर्ट हो गई और हालात पर काबू पाया गया।

इस बीच, खम्मम ज़िले के एनकुर मंडल के कोत्तामेडेपल्ली के लोगों ने वोटिंग का बायकॉट किया और विरोध जताते हुए उन्होंने कहा कि जब तक उनकी प्रॉब्लम्स सॉल्व नहीं हो जातीं, वे वोट नहीं देंगे। मामले की जानकारी मिलने के बाद अधिकारियों ने गांववालों को समस्याओं को सुलझाने का आश्वासन दिया। पुलिस ने करीमनगर ज़िले के जम्मीकुंटा मंडल के विलासागर गवर्नमेंट स्कूल में बने एक पोलिंग स्टेशन पर एक सरपंच कैंडिडेट से 28,500 रुपये ज़ब्त किए। इस बीच, लंदन में एमएस की पढ़ाई कर रहे स्टूडेंट लवण कुमार चुनावों के लिए रंगारेड्डी जिले में अपने होमटाउन अब्दुल्लापुरमेट आया। उसने आज अपने वोट के अधिकार का इस्तेमाल किया।

चुनाव के पोलिंग पैटर्न को मासाबटैंक एसईसी ऑफिस में स्टेट इलेक्शन ऑफिसर रानी कुमुदी ने मॉनिटर किया। वोटिंग पैटर्न को डैशबोर्ड के ज़रिए मॉनिटर किया गया। फील्ड लेवल पर इलेक्शन ऑब्जर्वर से डिटेल्स मांगी गईं। पीओ और माइक्रो ऑब्जर्वर को बुलाया गया और ग्राउंड पर हालात के बारे में पूछा गया। उन्होंने वहां के अधिकारियों से निर्मल में कम वोटिंग के बारे में बात की।

यह भी पढ़ें-

తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు, ఆ ఊళ్లో కొట్టుకున్న అభ్యర్థులు!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మొదటి విడత (డిసెంబర్ 11), రెండో విడత (డిసెంబర్ 14) ముగియగా ఇవాళ మూడో విడత పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంటకు ముగియగా ఆ లోపు పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకుని క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఈరోజే ఉప సర్పంచ్‌లను సైతం ఎన్నుకోనున్నారు.

చివరిదైన మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రెండు జీపీలలో ఎన్నికలపై కోర్టు స్టే విధించడంతో మిగిలిన 3,752 పంచాయతీలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. ఇక 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా 116 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవం అయ్యాయి. 18 వార్డులలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో మిగిలి 28,410 వార్డులకు ఇవాళ పోలింగ్ జరిగింది.

పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు అడుగుతున్నారని ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వారి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థి బోయిని రాములుకు గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో ఓ పోలింగ్ స్టేషన్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా తమ సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చేవరకు ఓట్లు వేయబోమని ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కొత్త మేడేపల్లి వాసులు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులకు సర్దిచెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓ సర్పంచ్ అభ్యర్థి వద్ద రూ. 28,500లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్న విద్యార్థి లవణ్‌‌కుమార్‌ ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌కు వచ్చాడు. ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

ఎన్నికల పోలింగ్ సరళిని మాసబ్‌ట్యాంక్ ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని పర్యవేక్షించారు. డ్యాష్ బోర్డు ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల పరిశీలకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీవోలు, సూక్ష్మ పరిశీలకులకు ఫోన్ చేసి గ్రౌండ్‌లో పరిస్థితిపై ఆరా తీశారు. నిర్మల్‌లో తక్కువ ఓటింగ్ నమోదవుతుండటంపై ఆమె అక్కడి అధికారులతో మాట్లాడారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X